ప్రస్తుతం టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి అతి తక్కువ టైంలోనే స్టార్డం అందుకున్నాడు. ఈ నెలాఖరున F3 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అనీల్ నెక్స్ట్ బాలయ్యతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి చేయబోయే సినిమాపై ఆసక్తి నెలకొంది. మొన్నీ మధ్య మహేష్ బాబు కోసం కథ రెడీ చేశానని ఆయన పిలవడమే ఆలస్యం మా కాంబోలో మరో సినిమా వస్తుందని చెప్పుకున్నాడు అనిల్.
దీంతో బాలయ్య సినిమా తర్వాత అనిల్ ఆల్మోస్ట్ మహేష్ బాబుతోనే సినిమా చేస్తాడని అనుకున్నారంత. కానీ తాజాగా నిర్మాత దిల్ రాజు మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు. F4 కి కూడా ఓ పాయింట్ ఉందని ఇటివలే అనిల్ తనతో ఆ లైన్ చెప్పాడని కచ్చితంగా F2 ఫ్రాంచైజీ ఇలాగే కొనసాగుతుందని తెలిపాడు. ఇక F2 అవ్వగానే అనిల్ F3 లైన్ చెప్పి ‘సరిలేరు నీకెవ్వరు’ ఫినిష్ చేసుకొచ్చి ఈ ఫ్రాంచైజీ తీసాడని చెప్పారు రాజు.
అయితే దిల్ రాజు చెప్పిన మాటలను బట్టి చూస్తే అనిల్ బాలయ్య సినిమా పూర్తిచేసుకొచ్చి F4 సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ లెక్కన F2 ఫ్రాంచైజీ గ్యాప్ లో ఓ కమర్షియల్ సినిమా చేస్తూ కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నట్టున్నాడు అనిల్. ఇక F2 ఆ రేంజ్ హిట్ సాదిస్తుందని, తమకి అన్ని లాభాలు తెచ్చిపెడుతుందని నిర్మాత దిల్ రాజు ఊహించలేదు. కానీ ఇప్పుడు ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో F3 మీద అలాగే అనిల్ డైరెక్షన్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే ఫస్ట్ కట్ వచ్చే వరకూ F3 గురించి ఏం తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. మరి దిల్ రాజు నమ్మకాన్ని అనీల్ నిలబెట్టి మరో బ్లాక్ బస్టర్ అందిస్తే F4 సెట్స్ పైకి వెళ్తుంది లేదంటే ఈ ఫ్రాంచైజీకి ఇక్కడితో ఫులిస్టాప్ పడనుంది.
This post was last modified on May 19, 2022 9:47 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన సొంతింటికి బుధవారం శ్రీకారం చుట్టారు.…
ఎవరైనా సంగీత దర్శకుడికి పేరొచ్చేది అతనిచ్చే మొదటి ఆల్బమ్ ని బట్టే. అది హిట్టయ్యిందా అవకాశాలు క్యూ కడతాయి. లేదూ…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం అత్యంత దారుణంగా గడిచిందని చెప్పక తప్పదు. ఓ…
రేపు, ఎల్లుండి బాక్సాఫీస్ కు నాలుగు కొత్త రిలీజులు ఉన్నాయి. మాములుగా అయితే సందడి ఓ రేంజ్ లో ఉండాలి.…
నాయకుడు అన్న వ్యక్తి.. హుందాగా వ్యవహరించాలి. పైగా.. గతంలో ఉన్నస్థాయి పదవులు అలంకరించిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే..…
భారత రిజర్వ్ బ్యాంకు బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా…