కరోనా అయిపోయింది. ఎక్కడా కేసులు లేవు. లాక్ డౌన్ల ప్రశ్నే లేదు. జన జీవనం ఎప్పుడో సాధారణమైపోయింది. ఎవరి వృత్తుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అన్ని పరిశ్రమలు సర్దుకున్నాయి. సినిమా రంగం కూడా చక్కగా కుదురుకుంది. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 లు చెరో 1100 కోట్లు వసూలు సౌత్ ఇండస్ట్రీ సత్తాని ప్యాన్ ఇండియా లెవెల్ లో చాటాయి. వీటి ప్రభావం ఎంతగా ఉందంటే కేవలం డబ్బింగ్ వెర్షన్లతోనే నార్త్ లోనూ నెలరోజులకు పైగా సుదీర్ఘమైన రన్ దక్కించుకున్న బ్లాక్ బస్టర్స్ గా అరుదైన ఘనత సాధించాయి.
కానీ బాలీవుడ్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మారింది. ఈ రెండేళ్ల కాలంలో గర్వంగా చెప్పుకునే ఒక్కటంటే ఒక్క స్ట్రెయిట్ బ్లాక్ బస్టర్ లేదు. ఎప్పటికప్పుడు కొత్తవి రిలీజ్ చేస్తున్నా అవి కనీస స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. మొన్న వచ్చిన జయేష్ భాయ్ జోర్దార్ ని అభిమానులే పట్టించుకోలేదు. దారుణమైన డిజాస్టర్. అంతకు ముందు వారం రన్ వే 34, హీరోపంటి 2 లు అత్తెసరు కలెక్షన్లతో డిస్ట్రిబ్యూటర్లకు నీరసం తెప్పించాయి. ఇక బచ్చన్ పాండే లాంటి వాటి గురించి సైలెంట్ గా ఉండటం ఉత్తమం.
ఇంత అనిశ్చితిని తమ సుదీర్ఘమైన అనుభవంలో ఎప్పుడూ చూడలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎల్లుండి రిలీజవుతున్న భూల్ భూలయ్యా 2 బుకింగ్స్ జస్ట్ పర్వాలేదనిపిస్తున్నాయి. ధాకడ్ ని అడిగే నాథుడు లేడు. ఖాన్ ద్వయం విపరీతమైన గ్యాప్ తీసుకోవడం ఈ పరిస్థితికి కారణంగా చెప్పుకోవచ్చు. జూన్ 3న వచ్చే పృథ్విరాజ్ సైతం అద్భుతాలు చేస్తుందన్న నమ్మకం తక్కువే. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా వచ్చే దాకా ఇప్పుడున్న సిచువేషన్ లో పెద్దగా మార్పు వచ్చేలా కనిపించడం లేదు. చూడాలి మరి.
This post was last modified on May 18, 2022 9:02 pm
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…