పవన్ కళ్యాణ్ తో క్రిష్ తీస్తున్న జానపద చిత్రానికి ముందు భారీ బడ్జెట్ అనుకున్నారు. కానీ పరిస్థితులు మారిపోవడంతో ఇప్పుడు ఈ చిత్రానికి బడ్జెట్ ఎక్కడ తగ్గించవచ్చు అనేది తర్కిస్తున్నారు. కథాపరంగా, పోరాట దృశ్యాల పరంగా క్రిష్ రాజీ పడలేనని చెప్పాడట.
అయితే ఈ చిత్రంలో డ్యూయెట్స్ అవసరం లేదని భావిస్తున్నాడట. దాని వల్ల హీరోయిన్ కి ఎక్కువ మొత్తం వెచ్చించనవసరం లేదు. అలాగే పాటలకు భారీ సెట్లు అవసరం లేదు. ప్రస్తుతానికి కీరవాణితో రెండు బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ మాత్రం చేయించుకున్నారట. అవసరాన్ని బట్టి పాటలు పెంచడం, తగ్గించడం గురించి ఆలోచించాలని, నిర్మాతకు తెలియజేసాడట.
ఈ చిత్రం షూటింగ్ మళ్ళీ మొదలు కావడానికి చాలా సమయం ఉందని అంటున్నారు. వకీల్ సాబ్ పూర్తయిన తర్వాతే దీనిని పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates