రాజకీయాల నుంచి సినిమాల వైపు మనసు మళ్లడంతో పవన్ కళ్యాణ్ ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాలు ఒకేసారి మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. దీక్ష పూనినట్టు వకీల్ సాబ్, క్రిష్ సినిమా చేస్తున్న టైంలో కరోనా విపత్తు వల్ల షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో పవన్ మూడ్ మళ్ళీ సినిమాల నుంచి డైవర్ట్ అయిందట.
వకీల్ సాబ్ షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టాలని దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్నారు. దసరాకి సినిమా రిలీజ్ చేసుకునే అవకాశం ఉన్నట్టయితే వాడుకోవాలనేది దిల్ రాజు ఐడియా. అయితే పవన్ షూటింగ్స్ చేసే మూడ్ లో లేకపోవడమే కాదు, సినిమా వాళ్లకు అందుబాటులోను లేరని వినిపిస్తోంది. కరోనా సమస్య ఇంకా అలాగే ఉంది కనుక అన్నీ నార్మల్ అయ్యేవరకు పవన్ షూటింగ్ చేసే ఆలోచనలో లేనట్టు భోగట్టా.
పవన్ మాత్రమే కాదు పలువురు అగ్ర హీరోలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. సినిమా, టీవీ రంగంలో కూడా కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ఇప్పుడు తొంభై శాతం మంది రిస్క్ చేయడానికి సిద్ధంగా లేరు.
Gulte Telugu Telugu Political and Movie News Updates