ఒకప్పుడు శత్రువు మొదలుకుని, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వరకు భారీ హిట్లు ఇచ్చి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు ఎం.ఎస్.రాజు. తన బేనర్లో తెరకెక్కే సినిమాల స్క్రిప్టు చర్చల్లోనూ కీలకంగా ఉంటూ, కొన్ని చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్‌గా కూడా క్రెడిట్ తీసుకుని.. తన సినిమాల విజయంలో ముఖ్య పాత్ర పోషించేవారు రాజు. ఎం.ఎస్. రాజు సినిమా అంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే భరోసా ప్రేక్షకులకు కలిగించిన ఘనత ఆయన సొంతం.
నిర్మాతలకు ఇలాంటి ఇమేజ్ అరుదుగా వస్తుంటుంది. ఐతే ప్రొడ్యూసర్‌గా ఒక దశ దాటాక వరుస పరాజయాలు, దర్శకుడిగా చేసిన విఫల ప్రయత్నాలతో ఆయన బ్రాండ్ వాల్యూ బాగా దెబ్బ తినేసింది. చాలా ఏళ్ల తర్వాత డర్టీ హరి అనే చిత్రంతో ఆయన పేరు కాస్త చర్చనీయాంశం అయింది. బోల్డ్ కంటెంట్‌తో యూత్‌ను బాగానే ఎంటర్టైన్ చేయగలిగారాయన. పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజైన ఆ సినిమా ఆయనకు ఆర్థికంగా కూడా మంచి ప్రయోజనమే కలిగించింది.
ఐతే బయటి హీరోతో మంచి ఫలితాన్నందుకున్న రాజు.. కొడుకును హీరోగా నిలబెడదామని డర్టీ హరి టైపు బోల్డ్ కంటెంట్‌తోనే 7 డేస్ 6 నైట్స్ అనే సినిమా తీశాడు. కానీ డర్టీ హరి లాగా ఈ సినిమా ప్రోమోలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయాయి. సంక్రాంతికే రిలీజ్ చేయాలనుకున్న ఈ చిత్రం.. వాయిదాల మీద వాయిదాలు పడింది. ఇప్పుడసలు ఈ సినిమా గురించి చర్చే లేదు. అందరూ దాని గురించి మరిచిపోయారు.
బిజినెస్ ఆఫర్లు ఏమీ లేవా.. లేక ఇంకేమైనా సమస్యలున్నాయేమో తెలియదు కానీ.. 7 డేస్ 6 నైట్స్ సినిమాను రాజు కూడా పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోంది. దాని సంగతి వదిలేసి ఇప్పుడు కొడుకు హీరోగా పెట్టి సతి అనే కొత్త సినిమా తీస్తున్నారాయన. దీని ఫస్ట్ లుక్ తాజాగా రిలీజైంది. తన గత రెండు సినిమాలకు భిన్నంగా ఈసారి రూరల్ బ్యాక్ డ్రాప్‌లో ఓ యాక్షన్ లవ్ స్టోరీ చేస్తున్నట్లున్నారాయన. కానీ ఇది కూడా ఏమంత ఆసక్తిని రేకెత్తించట్లేదు. ఇంతకీ ఈ కొత్త సినిమా సంగతి సరే.. 7 డేస్ 6 నైట్స్ మూవీని రాజు ఏం చేశాడో?
This post was last modified on May 12, 2022 8:49 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…