Movie News

కీర్తి సురేష్.. మళ్లీ ఇన్నాళ్లకు


మహానటి మూవీతో తనపై భారీగా అంచనాలు పెంచిన నటి కీర్తి సురేష్. ఆ సినిమా ముందు వరకు ఆమెను ఓ సగటు హీరోయిన్ లాగా చూశారే తప్ప ఒక నటిగా గుర్తించలేదు. సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన సినిమాలో లీడ్ రోల్‌కు కీర్తిని తీసుకోవడం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఐతే తన ప్రతిభను ప్రశ్నించిన అందరికీ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది ఈ మలయాళ భామ. ‘మహానటి’లో ఆమె నటనకు జనం ఫిదా అయిపోయారు. నేషనల్ అవార్డ్స్ జ్యూరీ సైతం ఆమె నటనకు మెచ్చి జాతీయ అవార్డు కట్టబెట్టింది.

ఐతే ఈ సినిమాతో వచ్చిన పేరుతో వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఒప్పుకుని చకచకా చేసేసింది కీర్తి. కానీ పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి.. వీటిలో ఒక్కటీ కనీస స్థాయిలో కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక స్టార్ హీరోల సరసన చేసిన కమర్షియల్ సినిమాలు సైతం తుస్సుమనిపించాయి. ఇటు సినిమాలూ మెప్పించక.. కీర్తి పాత్రలూ పండక ఆమె కెరీర్ తిరోగమనంలో పయనించింది.

కీర్తి మీద ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకున్న ప్రేక్షకులకు ప్రతిసారీ నిరాశ తప్పలేదు. ఆమె మీద పూర్తిగా ఆశలు కోల్పోతున్న దశలో ఇప్పుడు చిన్ని (తమిళంలో సాని కాయిదం) సినిమా అమేజాన్ ద్వారా రిలీజైంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లు చూసి జనాలు షాకైపోయారు. కీర్తి ఇలాంటి పాత్రలోనా అని. ఇప్పుడు సినిమా చూసి ఇంకా షాకవుతున్నారు. తనకు జరిగిన ఘోర అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే పాత్రలో కీర్తి పాత్ర.. ఆమె నటన అద్భుతం అనే చెప్పాలి. అత్యంత కిరాతకంగా హత్యలు చేసే సన్నివేశాల్లో కీర్తి పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే ఎమోషనల్ సీన్లలో ఆమె కన్నీళ్లు పెట్టించేసింది.

మొత్తంగా తన పాత్రను పరిశీలిస్తే ఇండియన్ సినిమాలో మరే స్టార్ హీరోయిన్ కూడా ఇలాంటి పాత్ర చేయలేదు అని ఘంటాపథంగా చెప్పేయొచ్చు. ఇలాంటి పాత్రను ఒప్పుకున్నందుకు కీర్తిని ఎంత పొగిడినా తక్కువే. సినిమా కూడా గ్రిప్పింగ్‌గా ఉండటం, కీర్తి పాత్ర భలేగా పేలడంతో ‘చిన్ని’ తన కెరీర్లో ఒక మైలురాయిలా నిలవడం ఖాయం అనే చెప్పాలి.

This post was last modified on May 6, 2022 10:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

1 hour ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago