సుమ అందుకే ఈ సినిమా చేసిందట

బుల్లితెర క్వీన్ గా ఓ వెలుగు వెలుగుతూ నిత్యం బిజీగా ఉండే సుమ ఎట్టకేలకు మళ్ళీ ‘జయమ్మ పంచాయితి’ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమాలో జయమ్మ అనే డిఫరెంట్ కేరెక్టర్ లో కనిపించబోతుంది సుమ. ఉత్తరాంద్రలోని పల్లెటూరి నేపథ్యంలో జరిగే ఈ కథలో తనకు ఇంపార్టెన్స్ ఉన్నందుకే ఈ సినిమా ఒప్పుకున్నాని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకుంది సుమ. అయితే దర్శకుడు ఈ కథతో చాలా ఏళ్లుగా తిరుగుతున్నాడని రమ్య కృష్ణ లాంటి వాళ్ళతో అనుకున్న ఈ కథ ఫైనల్ గా తన ఒడిలో పడిందని తెలిపింది. ఇక స్క్రిప్ట్ మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరగడంతో తనకి చేయాలనే ఇంట్రెస్ట్ వచ్చిందని చెప్పుకుంది సుమ.

అప్పుడెప్పుడో సినిమాలకు గ్యాప్ ఇచ్చి టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న సుమని ఇంత వరకూ ఎలాంటి స్పెషల్ రోల్స్ వరించలేదా ? అనే ప్రశ్నకి తనదైన స్టైల్ లో ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది సుమ. ‘బాహుబాలి’లో అనుష్క పాత్రకి ముందుగా తననే అనుకున్నారని కానీ పుల్లలు ఏరుకునే ఆ పాత్ర చేయడం ఇష్టం లేకే వదులుకున్నాని ఫన్ క్రియేట్ చేసింది. నిజానికి సుమ కి సినిమాల్లో చాలా కేరెక్టర్ వచ్చాయి. కానీ వాటిలో దేనికి ఆమె టెంప్ట్ అవ్వలేదు. దానికి స్ట్రాంగ్ రీజన్ కూడా ఉంది. ఒక వేళ సినిమా చేస్తే ఫ్యామిలీకి అలాగే టెలివిజన్ కి దూరమవుతాననే ఆలోచనతో ఆమె సినిమాలు ఒప్పుకోలేదు. పైగా జయమ్మ పంచాయితి లాంటి కథలు ఆమెకి ఇంత వరకూ రాలేదు. కేవలం కేరెక్టర్స్ కోసం రిస్క్ తీసుకోలేక సుమ ఇన్నేళ్ళు రీ ఎంట్రీ ప్లాన్ చేసుకోలేదు.

ప్రస్తుతం మెయిన్ లీడ్ గా జయమ్మ పంచాయితి లాంటి కథలతో ఇద్దరు ముగ్గురు సుమని అప్రోచ్ అయ్యారు. కానీ ‘జయమ్మ పంచాయితి’ సినిమా రిజల్ట్ ని బట్టే ఆ సినిమాలు సెట్ అవుతాయి. ఏ మాత్రం రిజల్ట్ తేడా కొట్టినా సిల్వర్ స్క్రీన్ కి గుడ్ బై చెప్పేసి స్మాల్ స్క్రీన్ లో మళ్ళీ ఎప్పటి లానే బిజీ అయిపోతుంది సుమ.