Movie News

మహేష్ ఓకే అంటే మొదలుపెట్టేస్తా..

చాలా తక్కువ సమయంలో తెలుగులో పెద్ద డైరెక్టర్లలో ఒకడైపోయాడు అనిల్ రావిపూడి. పటాస్ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా ప్రస్థానం ఆరంభించిన అతను.. ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్-2 చిత్రాలతో వరుస విజయాలందుకున్నాడు. దీంతో మహష్ బాబు లాంటి సూపర్ స్టార్ అతడికి ఛాన్స్ ఇచ్చాడు. మహేష్ నమ్మకాన్ని నిలబెడుతూ.. ‘సరిలేరు నీకెవ్వరు’తో సూపర్ హిట్ అందించాడు అనిల్. ఈ చిత్రానికి కొంత డివైడ్ టాక్ వచ్చినా తట్టుకుని బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచింది.

దీంతో అనిల్‌తో మరో సినిమా చేయడానికి మహేష్ ఆసక్తి చూపించాడు. కాకపోతే వీరి కలయికలో ఇంకో సినిమా రావడానికి టైం పట్టేట్లుంది. మహేష్‌కు ఉన్న కమిట్మెంట్లే అందుక్కారణం. ‘సరిలేరు..’ అనంతరం ‘సర్కారు వారి పాట’ను పూర్తి చేశాడు మహేష్. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయాల్సి ఉంది. మరోవైపు రాజమౌళి సినిమాలోనూ నటించాల్సి ఉంది.

ఐతే జక్కన్న సినిమాను మొదలుపెట్టేలోపు.. త్రివిక్రమ్ సినిమా అయ్యాక ఖాళీ దొరికి ఇంకో సినిమా చేసే అవకాశం ఉంటే చెప్పలేం. ఒకవేళ మహేష్ అప్పుడు అందుబాటులోకి వస్తే తప్పక ఆయనతో సినిమా చేస్తాననే సంకేతాలు ఇస్తున్నాడు అనిల్ రావిపూడి. ఓ ఇంగ్లిష్ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. మహేష్ కోసం తాను కథ రాస్తున్నట్లు వెల్లడించాడు. మహేష్‌ తనతో మరో సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడని.. కానీ ఆయన ఎప్పుడు అందుబాటులోకి వస్తారో తెలియదని.. ఐతే తాను మాత్రం స్క్రిప్టు పని మొదలుపెట్టేశానని అతను చెప్పాడు.

సూపర్ స్టార్ కోసం ఎగ్జైటింగ్ స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు అనిల్ తెలిపాడు. మహేష్ తన కమిట్మెంట్లన్నీ పూర్తి చేసుకుని.. అనిల్ సినిమా చేద్దామా అంటే చాలని, తాను సినిమాను మొదలుపెట్టేస్తానని.. అందుకే ఇప్పట్నుంచే దాని మీద పని చేస్తున్నానని అనిల్ వెల్లడించాడు. మరోవైపు నందమూరి బాలకృష్ణతోనూ అనిల్‌కు ఓ కమిట్మెంట్ ఉన్న సంగతి తెలిసిందే. బాలయ్యతో సినిమా చేయాలన్నది తన కల అని.. ఆయన కోసం ఒక కొత్త పాయింట్‌తో స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు కూడా అనిల్ వెల్లడించాడు. అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘ఎఫ్-3’ వచ్చే నెలాఖర్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on April 29, 2022 3:11 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

4 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

4 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

5 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

5 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

6 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

6 hours ago