చిరు అల్లుడి తొందర అందుకేనా?

షూటింగ్స్ మొదలు పెట్టడానికి చాలా మంది నటులు తటపటాయిస్తున్న తరుణంలో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ తన ‘సూపర్ మచ్చి’ సినిమా లాస్ట్ షెడ్యూల్ మొదలు పెట్టేసాడు. చాలా తక్కువ మంది బృందంతో, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూట్ చేస్తున్నారు.

షూటింగ్ కి అనువైన సమయం కాదని ఎన్నో సినిమాల షూటింగ్స్ నిలిపివేసి కూర్చుంటే, ఈ చిత్రానికి తొందర దేనికనే ప్రశ్నలు వస్తున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్నట్లయితే ఓటిటీ డీల్స్ వస్తాయని పలు చిన్న చిత్రాలను పూర్తి చేయాలని చూస్తున్నారు.

మొదటి సినిమా విజేతతో సక్సెస్ కాలేకపోయిన కళ్యాణ్ దేవ్ ఈ సినిమాతో ఎక్కువ మంది దృష్టిలో పడవచ్చునని ఓటిటీ రిలీజ్ కోసం ఆరాటపడుతున్నట్టు ఉన్నాడు. కారణం ఏదైనా కానీ, మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలుండగా, ఈ సమయంలో ముందుగా షూటింగ్ కి వచ్చిన క్రెడిట్ మాత్రం కళ్యాణ్ సొంతం చేసుకున్నాడు.