హైదరాబాద్ లో ‘ఆచార్య’ రిలీజ్ ప్రెస్ మీట్ గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. దీనికి చిరు, చరణ్, పూజ, దర్శకుడు కొరటాల హాజరయ్యారు. టెక్నీషియన్స్ లేకుండా కేవలం ఈ నలుగురే మీడియా ముందుకొచ్చారు. ముందుగా తమ సినిమా గురించి ఎలాంటి స్పీచ్ లేకుండా డైరెక్ట్ గా మేటర్ లోకి వచ్చేసి మీడియా ఇంటరాక్షన్ మొదలు పెట్టారు.
రిపోర్టర్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు చిరు కూల్ గా సమాదానం ఇచ్చారు. కానీ కొరటాల రియాక్షన్ మాత్రం మీడియాకి షాక్ ఇచ్చింది. సినిమాలో మీకు డ్యూయెట్ పాడుకోవడానికి మీకు హీరోయిన్ లేదు. తాజాగా కొరటాల శివ గారు కాజల్ సినిమాలో లేదనే విషయన్ని కూడా బయటపెట్టారు దీనిపై మీ ఫీలింగ్ చెప్పండి ? అని అడిగిన వెంటనే కొరటాల సీన్ లోకి ఎంటరై మైక్ లాక్కొని దీని గురించి చిరు రియాక్షన్ ఇవ్వకుండా చేశారు.
కాజల్ ఎందుకు లేదనే విషయంపై ఇప్పటికే పలు మార్లు చెప్పాను. మళ్ళీ అదే అడుగుతున్నారేంటి? అంటూ రియాక్ట్ అయ్యాడు. దీంతో చిరు కూడా తాను చెప్పేదేమి లేదంటూ నాది సేమ్ ఆన్సర్ అనేశారు. ఇక టికెట్ రేటుపై ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి కూడా చిరు కంటే ముందు కొరటాల శివ ఆన్సర్ ఇచ్చాడు.
దానికి కంటిన్యూగా చిరు తన వర్షన్ చెప్పుకున్నాడు. ఇలా ఆ ప్రశ్నలకి చిరు ఏదైనా చెప్పాలనుకునే లోపే కొరటాల మైక్ పట్టుకొని సమాధానం ఇవ్వడం ప్రెస్ మీట్ తర్వాత చర్చనీయాంశం అయ్యింది. బహుశా కాజల్ ఇష్యూ పై చిరు రియాక్షన్ ఎలా ఉంటుందో ? ఏం చెప్తారో ? అని భయపడి కొరటాల మేనేజ్ చేసినట్టున్నాడు.
This post was last modified on April 26, 2022 6:16 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…