‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భీమ్ పాత్రతో అతను దేశవ్యాప్తంగా మంచి గుర్తింపే సంపాదించాడు. తన క్రేజ్, మార్కెట్‌ను ఎంతగానో పెంచుకున్నాడు. కాకపోతే క్యారెక్టర్ పరంగా రామ్ చరణ్ డామినేషన్ ఎక్కువ అనిపించడంతో జూనియర్ అభిమానులు కొంత అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ సంగతి పక్కన పెట్టేసి.. తారక్ కొత్త సినిమా మీదికి వాళ్ల దృష్టి మళ్లింది.
ఐతే కొరటాల శివతో చేయాల్సిన ఈ సినిమా బాగా ఆలస్యం అవుతుండటం పట్ల వారిలో అసంతృప్తి ఉంది. ఏడాది కిందట అనౌన్స్‌మెంట్ ఇచ్చాక ఈ సినిమా గురించి ఏ అప్‌డేట్ లేకపోవడం వారికి రుచించట్లేదు. ఐతే జూన్‌లో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానున్నట్లు తాజాగా దర్శకుడు కొరటాల శివ వెల్లడించడం వారికి ఊరట. ‘ఆచార్య’ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా గురించి కొరటాల చెప్పిన మాటలు తారక్ అభిమానులకు మరింత కిక్ ఇచ్చేవే అనడంలో సందేహం లేదు.
‘జనతా గ్యారేజ్’ చేస్తున్నపుడే తామిద్దరం తర్వాత చేయబోయే సినిమా గురించి మాట్లాడుకున్నామని.. ఆ సినిమాను కొంచెం క్లాస్‌గా, సటిల్‌గా తీశామని.. ఈసారికి ఇలా కానిచ్చేద్దామని, కానీ తర్వాతి సినిమా చేసినపుడు మాస్‌గా చేద్దామని తారక్‌కు తాను అప్పుడే చెప్పానని కొరటాల తెలిపాడు. ఈసారి తారక్‌తో చేయబోయేది చాలా పెద్ద సినిమా అని కొరటాల వెల్లడించాడు. తన కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ స్క్రిప్ట్ అని కొరటాల స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం.
దీని కాన్వాస్ చాలా పెద్దదని.. తారక్ పాత్ర కూడా అందుకు తగ్గట్లే ఉంటుందని.. తన కెరీర్లో ‘మిర్చి’ పెద్ద మాస్ సినిమా అనుకుంటే.. దాన్ని మించిన మాస్, కమర్షియల్ విలువలు ఇందులో ఉంటాయని కొరటాల చెప్పాడు. తారక్ పాత్ర చాలా కొత్తగా, ఇప్పటిదాకా చేయని విధంగా ఉంటుందని కూడా కొరటాల చెప్పాడు. ఈ సినిమా వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుందని కూడా వివరించాడు. ఈ మాటలు తారక్ అభిమానులకు మామూలు ఉత్సాహాన్ని ఇవ్వట్లేదు. మరి కొరటాల మాటలకు తగ్గట్లే సినిమా ఉంటే బాక్సాఫీస్ ఊచకోత ఖాయమే.
This post was last modified on April 26, 2022 5:44 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…