RC16: మొదటిసారి క్లారిటీ ఇచ్చిన చరణ్

‘ఆచార్య’ రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిరు ఓ పక్క , చరణ్ మరోపక్క ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో భాగంగా ఇవ్వాళ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు చరణ్ . ఆచార్య గురించే కాకుండా #RC16 గురించి కూడా కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు. నిజానికి తనకు ఆప్షన్స్ ఇచ్చే దర్శకులంటే నచ్చదని వాళ్ళు నాతో ఎలాంటి కథ తీస్తే బాగుంటుందో ముందే ఫిక్సయి అప్రోచ్ అయితేనే బాగుంటుందని అన్నాడు. ఇటివలే ఓ పెద్ద డైరెక్టర్ తన దగ్గర నాలుగు కథలు ఉన్నాయని అందులో ఒకటి పిక్ చేసుకోమని తనని అడిగితే మీరే నాకు ఏది బాగుంటుందో పిక్ చేయండి అని చెప్పెశానని చెప్పుకున్నాడు చరణ్.

ఇక గౌతం తిన్ననూరి తను మైండ్ లో ఒక కథ ఫిక్స్ అయి తనని అప్రోచ్ అయ్యాడని కానీ మీకు ఏ జోనర్ చేయాలనుందని అడిగాడని అన్నాడు. ఇక గౌతం సినిమా అంటే కచ్చితంగా స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. కేవలం ముగ్గురు క్యారెక్టర్స్ పెట్టుకొని తను జెర్సీ అనే మంచి సినిమా తీసాడని అందుకే తనని నమ్మి తను ఎలాంటి కథ అనుకున్నాడో అదే చేద్దామని చెప్పానని చరణ్ తెలిపాడు. అలాగే తమ కాంబో సినిమా స్పోర్ట్స్ డ్రామా కాదని వేరే జోనర్ సినిమా అని క్లారిటీ ఇచ్చేశాడు.

శంకర్ తో చేస్తున్న సినిమా దాదాపు 60 శాతం షూట్ కంప్లీట్ చేసుకుందని దాని తర్వాతే గౌతంతో సినిమా ఉంటుందని అన్నాడు. ఇక ఏడాదికి రెండు సార్లు అయ్యప్ప దీక్షలో ఉండటం అలవాటు చేసుకున్నానని, అందుకే ఏడాది ఆరంభంలో అలాగే చివర్లో రెండు మాలలు వేస్తూ ఉంటానని ఈసారి ఆరంభంలో RRR వల్ల కుదరకపోవడంతో ఇప్పుడు ఆలస్యంగా మాల ధరించనని తెలిపాడు. తన మిత్రుడు ఎన్టీఆర్ ఎప్పటి నుండో ఆంజనేయ స్వామీ మాల ధరించాలని అనుకున్నాడని ఫైనల్ గా ఇప్పుడు ఆ దీక్ష చేపాట్టాడని చెప్పుకున్నాడు మెగా పవర్ స్టార్.