బాహుబలి-2 నెలకొల్పిన రికార్డులను బద్దలు కొట్టడం ‘ఆర్ఆర్ఆర్’కు కూడా సాధ్యం కాని పరిస్థితి. తెలుగు రాష్ట్రాల వరకు ఆ రికార్డులను అధిగమించినప్పటికీ.. అప్పటికి, ఇప్పటికి పెరిగిన టికెట్ల ధరలు, పెరిగిన స్క్రీన్లు, షోలను బట్టి చూస్తే అది మరీ గొప్ప విషయమేమీ కాదనే చెప్పాలి. ఏపీ, తెలంగాణను మినహాయిస్తే ఇండియాలో మిగతా రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో బాహుబలి-2 రికార్డులు పదిలంగా ఉన్నాయి.
రాజమౌళే తాను నెలకొల్పిన రికార్డులను తనే అధిగమించలేకపోయాడు. అలాంటిది ‘కేజీఎఫ్-2’.. ఇప్పట్లో అసాధ్యం అనుకున్న ‘బాహుబలి-2’ తొలి రోజు హిందీ కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టేసింది. నార్త్ ఇండియాలో అంచనాలను మించి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం.. ఏకంగా రూ.60 కోట్ల గ్రాస్ వసూల్ల క్లబ్బులోకి చేరింది. ఇప్పటిదాకా హిందీ మార్కెట్లో ఏ చిత్రం కూడా రూ.60 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టలేదు.
‘బాహుబలి: ది కంక్లూజన్’ ఐదేళ్ల కిందట రూ.58 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో నెలకొల్పిన రికార్డును ‘కేజీఎఫ్-2’ అధిగమించింది. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టినపుడే హిందీ మార్కెట్లో వసూళ్లు అసాధారణ స్థాయిలో ఉంటాయని అంచనా వేశారు ట్రేడ్ పండిట్లు. ఇక గత వారం వ్యవధిలో రోజు రోజుకూ క్రేజ్ పెరిగిపోవడం, ‘జెర్సీ’ సినిమా రేసు నుంచి తప్పుకోవడంతో ‘కేజీఎఫ్-2’కు ఎదురే లేకపోయింది.
అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ‘కేజీఎఫ్’ హిందీ వెర్షన్ రూ.30 కోట్ల మార్కును దాటేయడంతో ‘బాహుబలి-2’ రికార్డుకు ఎసరు పెట్టడం ఖాయమనిపించింది. ఇప్పుడు ఆ అంచనాకు తగ్గట్లే రికార్డును దాటేసింది. ‘బాహుబలి-2’ రికార్డు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. బాలీవుడ్ చిత్రాలకు, రాజమౌళి, ప్రభాస్ సినిమాలకు కూడా సాధ్యం కాని ఘనత ఇది. నెవర్ బిఫోర్ ఎలివేషన్లు, అద్భుతమైన విజువల్స్, కళ్లు చెదిరే యాక్షన్ ఘట్టాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతూలగిస్తుండగా.. హిందీ ప్రేక్షకులు మరింతగానే ఈ సినిమాతో ఎంటర్టైన్ అవుతున్నట్లున్నారు.
This post was last modified on April 15, 2022 2:55 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…