‘రంగస్థలం’ ముందు వరకు నటుడిగా అయితే రామ్ చరణ్‌కు మరీ గొప్ప పేరేమీ లేదు. ‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ హిట్‌తో పాటు కొన్ని ఘనవిజయాలు అందుకున్నప్పటికీ.. సామాన్య ప్రేక్షకుల్లో రామ్ చరణ్ నటన పట్ల అంత సానుకూల అభిప్రాయం ఉండేది కాదు. కానీ ‘రంగస్థలం’ సినిామతో తన మీద ఉన్న నెగెటివిటీనంతా చెరిపేశాడు మెగాస్టార్ వారసుడు. ఇప్పుడిక ‘ఆర్ఆర్ఆర్’తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు.
చరణ్ పెర్ఫామెన్స్ గురించి స్వయంగా రాజమౌళే ఎంత గొప్పగా చెబుతున్నాడో చూస్తూనే ఉన్నాం. తానెంత మంచి నటుడినో చరణ్‌కి తెలియదని, ప్రతి రోజూ సెట్‌కు ఒక వైట్ కాన్వాస్ లాగా వస్తాడని.. దాని మీద ఏం కావాలో అది రాసుకోవచ్చని.. ఇలాంటి నటుడిని తాను ఇప్పటిదాకా చూడనే లేదని రాజమౌళి ఇటీవల చెప్పడం తెలిసిందే. ఇప్పుడు చరణ్‌తో ‘ఆచార్య’ సినిమా చేసిన కొరటాల శివ సైతం దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో.
ఇంతకీ ‘ఆచార్య’లో సిద్ధా పాత్ర గురించి, అందులో చరణ్ పెర్ఫామెన్స్ గురించి కొరటాల ఏమన్నాడంటే..‘‘నేను చెప్పేదాంట్లో కొంచెం కూడా అతిశయోక్తి లేదు. ఒకసారి క్యారెక్టర్లోకి వచ్చిన తర్వాత.. ప్రతి రోజూ మేం ఆయనలో మేం సిద్ధాను మాత్రమే చూశాం. మొత్తం కాస్ట్ అండ్ క్రూ అందరూ ఆయనలో సిద్ధాను మాత్రమే చూశాం. మెగా పవర్ స్టార్ కానీ..రామ్ చరణ్ కానీ చూడలేదు. వ్యాన్ దిగడం సిద్ధా లాగే వస్తాడు. ఆ పాత్రను నమ్మాడు. అంత నిజాయితీగా ఉన్నారు.
ఇది ఒక రకంగా చెప్పాలంటే నాకు కల నిజమైనట్లే. అలాంటి నటులు మనకు దొరికినపుడు మనం అనుకున్నది ఇంకా తేలిక అవుతుంది. ఇంపాక్ట్ డబుల్ అవుతుంది. నిజంగా రామ్ చరణ్ గారికి సిన్సియర్‌గా థ్యాంక్స్ చెబుతున్నా. రామ్ చరణ్ మామూలుగా కూడా చాలా నిజాయితీగా అనిపిస్తాడు. షూటింగ్‌కు రావడమంటే తనకు స్కూల్‌కు వెళ్లినట్లే ఉంటుంది.
అతను కొత్త నటుడు కాదు. సూపర్ స్టార్ డమ్ వచ్చిన తర్వాత ప్రతి రోజూ జీరో బ్యాగేజ్‌తో సెట్లోకి రావడం కానీ.. పాత్రలో మాత్రమే ఉండటం.. నిజాయితీగా, ఒక చిన్న పిల్లాడిలాగా కనిపిస్తాడు. తర్వాతేంటి అంటే.. ఏమీ రాయని పలక లాగా కనిపిస్తాడు. మనం చెప్పింది ఎక్కించుకుని వెళ్లి అక్కడ చేసేస్తాడు. ఇలాంటి నటులు అరుదుగా ఉంటారు. చరణ్ లాంటి నటుడు నా సినిమాలో చేయడం నా అదృష్టం’’ అంటూ చరణ్‌పై కొరటాల ప్రశంసల జల్లు కురిపించాడు.