ఒకప్పుడు తెలుగు బాక్సాఫీస్ మీద తమిళ సినిమాల దండయాత్ర మామూలుగా ఉండేది కాదు. రజినీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య, కార్తి.. ఇలా చాలామంది కోలీవుడ్ స్టార్ల సినిమాలు తెలుగులో ఇరగాడేసేవి. వాళ్ల సినిమాలకు పోటీగా మన చిత్రాలు రిలీజ్ చేయడానికి భయపడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఐతే కాల క్రమంలో వీళ్లందరికీ తెలుగులో ఫాలోయింగ్ పడిపోయింది. తమిళ అనువాద చిత్రాలను మన వాళ్లు అంతగా పట్టించుకోవడం లేదు.
ఐతే గతంలో మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ స్టార్లందరికీ ఇక్కడ డిమాండ్ పడిపోతే.. ఒకప్పుడు ఇక్కడ ఏమాత్రం గుర్తింపు లేని విజయ్‌కి గత కొన్నేళ్లలో మన దగ్గర ఫాలోయింగ్ పెరిగింది. అదిరింది, విజిల్, మాస్టర్.. ఇలా వరుసగా అతడి సినిమాలు తెలుగులో బాగా ఆడేస్తున్నాయి. అతడి మార్కెట్ పది కోట్ల మార్కును కూడా టచ్ చేసింది. ఐతే ఇలా పెరుగుతున్న తన ఫాలోయింగ్, మార్కెట్‌ను ఇంకో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం విజయ్ చేయట్లేదు. తన సినిమాలను బాగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి అతడికి తీరిక ఉండట్లేదు.
బీస్ట్‌కు తెలుగులో మంచి క్రేజే ఉన్నా.. దాన్ని మరింత పెంచే ప్రయత్నం విజయ్ చేయట్లేదు. తమిళంలో ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ.. ఒకప్పుడు సూర్య లాగా తెలుగు ప్రేక్షకులను ఓన్ చేసుకుని వారికి చేరువ కావాలని విజయ్ చూడట్లేదు. మన తెలుగు స్టార్లు తమిళంలో రిలీజయ్యే తమ సినిమాల ప్రమోషన్ల కోసం చక్కగా చెన్నైకి వెళ్లి ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. ప్రెస్ మీట్లు పెడుతున్నారు. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు ఇలాగే చక్కగా ప్రమోషన్లు చేశారు. ఆ సినిమాలకు ఎంత మంచి ఫలితం వచ్చిందో తెలిసిందే. కేవలం ప్రమోషన్లతో సినిమాలు ఆడేయవు కానీ.. సినిమాలు బాగుంటే ప్రమోషన్లు ప్లస్ అవుతాయన్నది వాస్తవం.
ఐతే తన రేంజికి హైదరాబాద్ వచ్చి తన సినిమాను ప్రమోట్ చేయడం ఏంటి అనుకుంటున్నాడో ఏమో.. విజయ్ ఇటు వైపు చూడట్లేదు. గతంలో తనకు ఇక్కడ గుర్తింపు లేనపుడు స్నేహితుడు, జిల్లా మూవీస్ ని ప్రమోట్ చేసిన విజయ్.. ఇప్పుడు ఫాలోయింగ్ పెరిగాక ఇటు వైపు రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. శుక్రవారం జరిగిన విజయ్ కొత్త చిత్రం బీస్ట్ ప్రమోషనల్ ఈవెంట్లో హీరోయిన్ పూజా హెగ్డే, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, దర్శకుడు నెల్సన్ మాత్రమే హాజరయ్యారు.
This post was last modified on April 9, 2022 8:36 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…