Movie News

పంతానికి పోయిన ఆ హీరో

ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత సౌత్ ఇండియాలో మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఏదంటే మరో మాట లేకుండా ‘కేజీఎఫ్-2’ పేరు చెప్పేయొచ్చు. నిజానికి దీని క్రేజ్ కేవలం సౌత్ ఇండియాకు పరిమితం కాదు కూడా. ‘కేజీఎఫ్-1’ ఉత్తరాదిన కూడా సూపర్ హిట్టయిన నేపథ్యంలో అక్కడి ప్రేక్షకులు కూడా ‘కేజీఎఫ్-2’ కోసం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఏప్రిల్-14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

వివిధ ఇండస్ట్రీల్లో దీనికి పోటీగా సినిమాలు దించడానికి భయపడుతున్నారు. తెలుగులో కూడా ఆ వీకెండ్లో చెప్పుకోదగ్గ రిలీజ్ ఏదీ లేదు. హిందీలో సైతం ఇప్పటికైతే ‘కేజీఎఫ్-2’కు పోటీ లేనట్లే కనిపిస్తోంది. కానీ తమిళంలో మాత్రం ఓ భారీ చిత్రం ‘కేజీఎఫ్-2’తో పోటీకి సై అంటోంది. ఆ చిత్రమే.. బీస్ట్. ప్రస్తుతం తమిళంలో నంబర్ వన్ హీరో అనదగ్గ విజయ్ లీడ్ రోల్‌లో కోలమావు కోకిల, డాక్టర్ చిత్రాలతో సూపర్ హిట్లు కొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించిన చిత్రమిది.

గత కొన్నేళ్ల నుంచి విజయ్ ఊపు మామమూలుగా లేదు. రజినీకాంత్ సహా అందరినీ వెనక్కి నెట్టేసి టాప్ ప్లేస్‌కు వెళ్లిపోయాడతను. అతడి సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా బ్లాక్‌బస్టర్లవుతున్నాయి. వసూళ్ల  మోత మోగించి రికార్డులు బద్దలు కొడుతున్నాయి. గత ఏడాది ‘మాస్టర్’ డివైడ్ టాక్‌ను తట్టుకుని బ్లాక్‌బస్టర్ అయింది. అసలే విజయ్, ఆపై నెల్సన్‌తో సినిమా కావడంతో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. బీస్ట్’ చిత్రాన్ని ఏప్రిల్ 14కే అనుకున్నప్పటికీ.. ‘కేజీఎఫ్-2’ ఆ డేట్‌కే ఫిక్సవడంతో విజయ్ సినిమా వాయిదా పడుతుందేమో అన్న సందేహాలు కలిగాయి.

కేజీఎఫ్-2 పాన్ ఇండియా మూవీ కాబట్టి దాని డేట్ మార్చడానికైతే అవకాశం లేదు. అలాగని విజయ్ సినిమా కూడా వెనక్కి తగ్గలేదు. తమిళనాడు అవతల ‘కేజీఎఫ్-2’ వల్ల వసూళ్లలో బాగా కోత ఉంటుందని, తమిళనాట కూడా గట్టి పోటీ తప్పదని తెలిసినా విజయ్ మూవీ తగ్గలేదు. ఒక్క రోజు ముందుగా ఏప్రిల్ 13నే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేయబోతున్నారు. సినిమాకు సెన్సార్ కూడా పూర్తయింది. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగానే డేట్ ప్రకటించబోతున్నారు. ‘కేజీఎఫ్-2’కు భయపడి తన సినిమాను వాయిదా వేయడమేంటని విజయ్ పంతానికి పోతున్నాడేమో అన్న చర్చ నడుస్తోంది. మరి ‘కేజీఎఫ్-2’ను ఢీకొట్టి ఓవరాల్‌గా ‘బీస్ట్’ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.

This post was last modified on March 22, 2022 10:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నా సినిమా లేకపోయి ఉంటే OG ని తీసుకొచ్చేవాడిని : చరణ్

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…

3 minutes ago

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

3 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

9 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

10 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

12 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

14 hours ago