‘ఆర్ఆర్ఆర్’ మొదలైన దగ్గర్నుంచి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల స్నేహం చర్చనీయాంశం అవుతూనే ఉంది. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయడానికి సిద్ధపడటమే అద్భుతమైన విషయం. ఏదో మొక్కుబడిగా కలిసినట్లు కాకుండా.. వ్యక్తిగత స్నేహ బంధంతోనే వీళ్లిద్దరూ కలిసి సినిమా చేశారనే అభిప్రాయం తర్వాతి రోజుల్లో అందరికీ అర్థమైంది. మెగా-నందమూరి ఫ్యాన్ వార్స్‌కు దశాబ్దాల చరిత్ర ఉందన్న సంగతి అందరికీ తెలుసు.
ఐతే ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో ఆ వైరాన్ని పక్కనపెట్టి అందరూ ఒక్కటవ్వాలనే సంకేతాలను తారక్, చరణ్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. తామిద్దరం ఎంత మంచి మిత్రులమో తెలియజేస్తూనే ఉన్నారు. అయినా అభిమానుల్లో అంత మార్పేమీ రావట్లేదు. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ కొనసాగుతూనే ఉన్నాయి. సినిమాలో ఎవరిది డామినేషన్.. ఎవరు మెయిన్ హీరో.. ఈ సినిమా సక్సెస్ అయితే ఎవరికెక్కువ క్రెడిట్ వస్తుందనే విషయంలో విపరీతంగా గొడవ పడుతూనే ఉన్నారు.
నిన్న చిక్‌బళ్లాపూర్‌లో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కూడా ఇద్దరు హీరోల అభిమానులు ఎవరి స్థాయిలో వాళ్లు బలప్రదర్శన చేసే ప్రయత్నం చేశారు. ఏ హీరో జెండాలు ఎక్కువ ఎగిరాయి.. ఎవరి అభిమానులు ఎక్కువ అరిచారు.. ఏ హీరో సభలో బాగా మాట్లాడాడు.. ఎవరికి స్టేజ్ మీద ఎక్కువ ఎలివేషన్ దక్కింది.. లాంటి చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ సభలో మెగా అభిమానులు జనసేన జెండా ఎగరవేయడం, తారక్ ఫ్యాన్స్ దాన్ని తీసి పడేయడంపైనా చిన్న వివాదం నడిచింది. ఐతే ఇలా గొడవ పడేవాళ్లు తమ హీరోలు ఈ సభలో ఎంత సన్నిహితంగా మెలిగారు, ఒకరి గురించి ఒకరు ఎంత బాగా మాట్లాడారు అన్నది చూడాలి.
ముఖ్యంగా తారక్ మాటలు ఫ్యాన్ వార్స్ చేసే అభిమానులకు కాస్తయినా జ్ఞానోదయం కలిగించి ఉండాలి. తన అభిమానుల గురించి ప్రస్తావించి.. ఈ సినిమా వల్ల చరణ్ అభిమానులు కూడా తనకు దక్కారని అన్నాడతను. చరణ్‌తో స్నేహ బంధానికి దిష్టి తగలకూడదని కూడా వ్యాఖ్యానించాడు. ఈ ఈవెంట్లో మధ్యాహ్నం నుంచి జరుగుతున్న పరిణామాలు తారక్‌కు తెలియకుండా ఉండవు. అయినా సరే.. అవన్నీ పక్కన పెట్టి తమ ఇద్దరి అభిమానుల బంధం గురించి మాట్లాడాడు. అన్నింటికీ మించి మీరు ఎంత సఖ్యతతో ఉంటే మా నుంచి అన్ని గొప్ప సినిమాలు వస్తాయి అనడం ద్వారా ఫ్యాన్ వార్స్ ఆపేయాలని, అందరూ కలిసి సాగాలని పిలుపునిచ్చాడు. మరి ఇప్పుడైనా మెగా, నందమూరి ఫ్యాన్స్.. ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో కొట్టుకోవడం మానేసి తెలుగు సినిమా గర్వించదగ్గ ‘ఆర్ఆర్ఆర్’ విడుదలను సెలబ్రేట్ చేసుకోవడంపై దృష్టిసారిస్తే మంచిది
This post was last modified on March 20, 2022 3:19 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…