అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలతో నటించిన హన్సిక కెరీర్.. కాస్త వేగంగానే డల్ అయ్యిందని చెప్పాలి. హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువగా బ్యాగ్‌లో పడటంతో టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం తగ్గిపోయింది. కొందరు చిన్న హీరోలతో వర్క్ చేసినా సక్సెస్ ఆమెకి దూరంగానే ఉండిపోయింది. దాంతో ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలు చేసుకుంటోంది. ఇప్పుడు మరో కొత్త సినిమాని పట్టాలెక్కించింది.
శివరాత్రి సందర్భంగా హన్సిక కొత్త సినిమా మొదలయ్యింది. తమిళంలో రీమేక్ సినిమాలకి ఫేమస్ అయిన ఆర్.కణ్ణన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం అతను మలయాళ హిట్ ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’ని తమిళంలో తీస్తున్నాడు. ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో థ్రిల్లర్ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు హన్సికతో సినిమాని స్టార్ట్ చేశాడు.
హన్సికతో పాటు దర్శకుడికి కూడా వేరే కమిట్మెంట్స్ ఉండటంతో వీలైనంత వేగంగా ఈ సినిమాని పూర్తి చేసేలా ప్లాన్ చేసింది టీమ్. రెండే రెండు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసేస్తారట. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి ఆగస్టు 15న మూవీని విడుదల చేసేస్తామని కూడా చెప్పేశారు. ఇది ఓ సైఫై సినిమా. హారర్ కామెడీ ప్రధానంగా సాగుతుంది. హన్సిక ఓ సైంటిస్ట్ పాత్రలో కనిపించబోతోంది.
హన్సిక కెరీర్ బెస్ట్ మూవీస్‌లో సి.సుందర్ తీసిన ‘ఆరణ్మణై’ ఫ్రాంచైజీ కూడా ఉంది. ఇంతవరకు మూడు మూవీస్ వచ్చాయి. మొదటి రెండు భాగాల్లోనూ హన్సిక నటించింది. ఆ రెండూ ఆమెకి మంచి సక్సెస్‌ని ఇచ్చాయి. ఆ తర్వాత చెప్పుకోదగ్గ హిట్లు దక్కలేదు తనకి. ఇప్పుడు మరోసారి హారర్ జానర్‌ని సెలెక్ట్ చేసుకుంది. పైగా కణ్ణన్ లాంటి మంచి డైరెక్టర్ తీస్తున్నాడు కాబట్టి ఈసారి కూడా కలిసొస్తుందేమో చూడాలి.
This post was last modified on March 2, 2022 8:55 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…