నిత్యా మీనన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తనదైన అందం, అభినయంతో అనతి కాలంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిత్యా.. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో నటించిన చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా.. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.
మలయాళ సూపర్ హిట్ `అయ్యప్పనుమ్ కోషియుమ్`కు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. తమన్ సంగీతం సమకూర్చారు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
టాక్ బాగుండటం వల్ల ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతూ దుమ్ము దులిపేస్తుంది. అంతా బాగానే ఉన్నా.. ఒక్క విషయంలో మాత్రం నిత్యా మీనన్ బాగా హట్టైందట. అసలేం జరిగిందంటే.. పవన్ కళ్యాణ్- నిత్య మీనన్ నడుమ చిత్రీకరించిన `అంత ఇష్టం ఏందయ్యా` అనే మెలోడీ సాంగ్ సినిమా రిలీజ్‌కి ముందే భారీ రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రీ రాయగా.. సింగర్ చిత్ర ఈ పాటను ఎంతో అద్భుతంగా ఆలపించారు. సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సాంగ్ యూట్యూబ్‌లో అనేక రికార్డులను సైతం కొల్లగొట్టింది. కానీ, సినిమాలో మాత్రం ఈ పాటను మేకర్స్ తొలగించి షాక్ ఇచ్చారు. దీంతో ఇంత మంచి సాంగ్‌ను ఎందుకు తీసేశారంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ.. `మంచి వేడి మీద సాగుతున్న సన్నివేశాల నడుమ కూల్‌గా అనిపించే ఈ సాంగ్ ఉంటే బాగుండదనే ఉద్ధేశంతో తొలగించాము` అంటూ తమన్ చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ ఈ మెలోడీ సాంగ్‌ను తొలగించడంపై నిత్యా మీనన్ బాగా ఫీల్ అయిందని అంటున్నారు.
This post was last modified on March 1, 2022 11:13 am
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…