ఎన్టీఆర్ మూవీలో జాన్వీ.. బోనీ కపూర్ షాకింగ్ రియాక్ష‌న్‌!

అల‌నాటి అందాల తార‌, దివంగ‌త న‌టి శ్రీ‌దేవి ముద్దుల కుమార్తె జాన్వీ క‌పూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `దఢక్` అనే హిందీ చిత్రంతో సినీ కెరీర్ స్టార్ట్ చేసి ఈ ముద్దుగుమ్మ‌.. మొద‌టి ప్ర‌యోగంలోనే త‌న న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల చేత ప్ర‌శంస‌లు అందుకుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేస్తున్న జాన్వీ.. త్వ‌ర‌లోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ని గ‌త కొద్ది రోజుల నుంచీ ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

ముఖ్యంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మూవీతో ఈమె ఎంట్రీ ఉంటుంద‌ని బ‌లంగా టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని పూర్తి చేసుకున్న‌ ఎన్టీఆర్ త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించాడు. కళ్యాణ్ రామ్ సమర్పణ‌లో నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాకర్ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు.

త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ క‌పూర్‌ను ఫైన‌ల్ చేసిన‌ట్లు సోష‌ల్ మీడియాలో తెగ ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే దీనిపై తాజాగా జాన్వీ తండ్రి, బాలీవుడ్ బ‌డా నిర్మాత బోనీ క‌పూర్ రియాక్ట్ అవుతూ షాకింగ్ రిప్లై ఇచ్చారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన `వలీమై` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న బోనీ క‌పూర్‌.. జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ మాట్లాడారు.

`దక్షిణాది చిత్ర పరిశ్రమ అంటే త‌మ‌కు ఎంతో అభిమానం. ఇక్కడ సినిమాల్లో నటించడంతోనే శ్రీదేవి ఆల్ ఇండియా లేడీ స్టార్‌గా సత్తా చాటారు. జాన్వీ ఆమె తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తుంది.  మంచి స్క్రిప్ట్, డైరెక్టర్ దొరికితే తెలుగుతో సహా దక్షిణాది భాషల్లో జాన్వీ త‌ప్ప‌కుండా నటిస్తుంది` అని చెప్పుకొచ్చారు బోనీ క‌పూర్‌.

ఇక `ఎన్టీఆర్ 30`లో జాన్వీ హీరోయిన్‌గా చేస్తుంది అన్న‌ది కేవ‌లం రూమ‌రే అని..ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి నన్నెవరూ కలవలేద‌ని బోనీ క‌పూర్ స్ప‌ష్టం చేశారు. అంతేకాదు సోషల్ మీడియాను ఫాలో అయితే పిచ్చోళ్ళు కావడం ఖాయమని కూడా చెప్పుకొచ్చారు.