పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈయన హీరోగా కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. కృష్ణంరాజు సమర్పణలో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రశీదలు అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇందులో పూజా హెగ్డే హీరోయన్‌గా నటించగా.. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సత్యరాజ్, జగపతిబాబు కీలక పాత్రలను పోషించారు. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా మార్చి 11న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. త్వరలోనే మేకర్స్ ప్రమోషన్స్ కూడా షురూ చేయనున్నారు.
ఇక ఈ సినిమా హిందీ వర్షన్‌కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. అంటే సినిమా కథ అంతా బిగ్‌బి నెరేట్ చేయనున్నారన్నమాట. ఈ విషయాన్ని మేరక్స్ ఇప్పటికే అధికారికంగా తెలియజేశారు. దీంతో ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. రాధేశ్యామ్ తెలుగు వర్షన్ కోసం ప్రభాస్ మహేష్ బాబును సాయం కోరాడట.
తెలుగులో మహేష్ వాయిస్ ఓవర్ ఇస్తే సినిమాకు మరింత ప్లాస్ అవుతుందని భావించిన మేకర్స్.. తాజాగా ఆయన్ను సంప్రదించారట. దాంతో ప్రభాస్ కోసం మహేష్ వెంటనే రాధేశ్యామ్ కథ నెరేటర్‌గా మారేందుకు ఓకే చెప్పాడని టాక్ నడుస్తోంది. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అఫీషల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిందే.
కాగా, 1970 దశకంలో ఇటలీ బ్యాక్‌డ్రాక్‌లో సాగే వింటేజ్ ప్రేమ కథా చిత్రమిది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా పేరున్న హస్తసాముద్రికుడు విక్రమాదిత్యగా ప్రభాస్, ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డేలు కనిపించబోతున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ మూవీకి సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు.
This post was last modified on February 23, 2022 3:38 pm
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…