కార్తికేయ గుమ్మకొండ.. ఈయన గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ప్రేమతో మీ కార్తీక్` అనే మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన కార్తికేయ.. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన `ఆర్‌ఎక్స్ 100`తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. 2018లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో కార్తికేయకు కావాల్సినంత ఫేమ్ దక్కింది.
అయితే ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేశాడీయన. కానీ, సరైన హిట్ మాత్రం పడలేదు. ఈయన చివరిగా నటించిన `చావు కబురు చల్లగా`, `రాజా విక్రమార్క` చిత్రాలు రెండూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. ప్రస్తుతం కార్తికేయ `వలిమై` సినిమాతో పలకరించబోతున్నాడు. కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో కార్తికేయ విలన్‌గా నటించాడు.
ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహించగా.. బోణీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 24న తమిళంలో పాటు తెలుగులోనూ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్.. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
అయితే ఈ ఈవెంట్‌లో `వలిమై`ను సూపర్‌గా ప్రమోట్ చేసిన కార్తికేయ.. ఓ విషయంలో మాత్రం పప్పులో కాలేశాడు. అసలేమైందంటే.. కార్తికేయ స్టేజ్‌పై మాట్లాడుతూ సినిమా విడుదల తేదీని మరిచిపోయాడు. ఫిబ్రవరి 24న వలిమై రిలీజ్ అవుతోంది. కానీ నవంబర్ 24న అంటూ ఆయన నోరు జారేశాడు. అయితే కొద్ది సేపటికి తప్పు తెలుసుకున్న కార్తికేయ.. వెంటనే అందరికీ క్షమాపణలు చెప్పాడు.
`ఇందాక మాట్లాడుతూ విడుదల తేదీని తప్పుగా చెప్పాను.. కన్ఫ్యూజన్‌లో ఫిబ్రవరి 24కు బదులు నవంబర్ 24 అని అనేశాను. నిజానికి అది నా పెళ్లి రిసెప్షన్ రోజు. క్షమించండి` అంటూ కార్తికేయ తన తప్పును సరిచేసుకున్నాడు. కాగా, ఈ యంగ్ హీరో గత ఏడాదే ఓ ఇంటివాడయ్యాడు. 11 ఏళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రేయసి లోహితను కార్తికేయ నవంబర్‌లో వివాహం చేసుకున్నాడు.
This post was last modified on February 23, 2022 12:21 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…