మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన ఆయన ఇప్పుడు మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటిస్తున్నారు. మలయాళ ‘లూసిఫర్’ సినిమాకి ఇది రీమేక్. దీంతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళాశంకర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇవి కాకుండా.. దర్శకుడు బాబీతో ఓ సినిమా అలానే.. వెంకీ కుడుములతో మరో సినెమా చేయబోతున్నారు.
అయితే వెంకీ కుడుములతో మెగాస్టార్ ఎలాంటి సినిమా చేయబోతున్నారనే విషయంలో ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. కథ ప్రకారం సినిమాలో చిరు మాఫియా డాన్ గా కనిపిస్తారట. అలా అని సినిమా మొత్తం సీరియస్ గా ఉండదట. కామెడీ ఓ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ స్టైల్ లో ఈ సినిమా ఉంటుందని టాక్. యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్ లో సినిమాను రూపొందించనున్నారు.
ఇప్పటికే వెంకీ కుడుముల స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. చిరుకి ఫైనల్ డ్రాఫ్ట్ బాగా నచ్చిందట. ప్రస్తుతం నటీనటులను, టెక్నీషియన్స్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను రూపొందించనున్నారు. వచ్చే నెలలో ఈ సినిమాను అఫీషియల్ గా లాంఛ్ చేయనున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి 2023లో విడుదల చేయాలనుకుంటున్నారు.
ఏప్రిల్ 29న చిరు నటించిన ‘ఆచార్య’ విడుదల కానుంది. అలానే ఈ ఏడాదిలో చిరు నుంచి మరో సినిమా రానుంది. వచ్చే ఏడాది ఎలా లేదన్నా.. మెగాస్టార్ రెండు సినిమాలను రిలీజ్ చేయడం ఖాయం. ఆయన లైనప్ చూసి కుర్ర హీరోలు సైతం షాకవుతున్నారు. మొత్తానికి ఈ రెండేళ్లలో చిరు అభిమానులకు విజువల్ ట్రీట్ ఖాయం.
This post was last modified on February 21, 2022 3:36 pm
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే…