అలాంటి సినిమా జీవితానికి ఒక్క‌టి చాలు

Keerthy Suresh

మ‌హాన‌టి – బ‌యోపిక్‌లు ఎలా తీయాలి? అనే ప్ర‌శ్న‌కు తెరెత్తు స‌మాధానంగా నిలిచింది మ‌హాన‌టి. ఆ సినిమాలో అన్ని విభాగాలూ… మ‌న‌సు పెట్టి ప‌నిచేశాయి. అందుకే… సావిత్ర‌మ్మ‌కి మ‌ళ్లీ ప్రాణం పోసి, త‌న క‌థ‌ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చూసే అదృష్టం తెలుగువారికి ద‌క్కింది. మ‌హాన‌టి త‌ర‌వాత మ‌ళ్లీ బ‌యోపిక్‌లు తీయ‌న‌ని ద‌ర్శ‌కుడు నాగ అశ్విన్ తేల్చేశాడు. ఇలాంటి మైల్ స్టోన్ జీవితానికి ఒక్క‌టి చాలు క‌దా..?

ఇప్పుడు కీర్తి సురేష్ కూడా అదే మాట అంటోంది. మ‌హాన‌టితో జాతీయ ఉత్త‌మ న‌టి అనిపించుకున్న కీర్తి సురేష్‌కి… ఆ త‌ర‌వాత బ‌యోపిక్ అవ‌కాశాలు వ‌రుస క‌ట్టాయి. చాలా క‌థ‌లు ఆమెను వెదుక్కుంటూ వెళ్లాయి. ఒక‌ట్రెండు బ‌యోపిక్ ప్రాజెక్టులు ఆమె ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని టాలీవుడ్ టాక్‌. కానీ… అవేం నిజం కాద‌ని తేల్చేసింది కీర్తి.

”నా జీవితంలో ఒకే ఒక్క బ‌యోపిక్ ఉంది. అదే.. మ‌హాన‌టి. అలాంటి సినిమా జీవితానికి ఒక్క‌టి చాలు క‌దా. ఇక‌ముందు బ‌యోపిక్‌లు చేయ‌ను. ఆ ఉద్దేశం నాకు లేదు” అని తేల్చేసింది. ప్ర‌స్తుతం నితిన్‌తో రంగ్‌దే చేస్తోంది. తాను న‌టించిన ‘పెంగ్విన్‌’ ఈనెల 19న నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో విడుద‌ల అవుతోంది. మ‌హేష్ బాబు ‘స‌ర్కారువారి పాట‌’ సినిమాలో క‌థానాయిక‌గా కీర్తి సురేష్ పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. అది త‌న ఖాతాలో వేసుకుంటే… మ‌రో గోల్డెన్ ఛాన్స్‌కొట్టేసిన‌ట్టే.