‘ఏక్ మినీ కథ’ హీరోయిన్ అరెస్ట్

కెరీర్ స్టార్టింగ్‌లో తప్పులు చేస్తే చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికే చాలామంది విషయంలో అది జరిగింది. ఇప్పుడు మరో నటి కూడా తప్పు చేసి చెడ్డ పేరు తెచ్చుకుంది. తనే కావ్యా థాపర్. ‘ఏక్‌ మినీ కథ’ సినిమాలో సంతోష్‌ శోభన్‌కి జోడీగా నటించిన ఈ అమ్మాయిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.      

ఓ పార్టీలో బాగా డ్రింక్ చేసిన కావ్య.. కారు నడుపుతూ ఒకరికి డ్యాష్ ఇచ్చింది. ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వాళ్లు ఆమెని ప్రశ్నిస్తున్నప్పుడు బతిమాలుకోవాల్సింది పోయి ఆవేశంతో ఊగిపోయిందట.

గొడవ చేయడంతో పాటు అబ్యూజివ్ లాంగ్వేజ్ కూడా వాడిందట. వారిపై దాడికి కూడా దిగడంతో అరెస్ట్ చేసి లోపలేసినట్లు నార్త్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.       

ఇరవయ్యారేళ్ల కావ్య చాలా యాడ్స్‌లో నటించింది. మ్యూజిక్ వీడియోస్ కూడా చేసింది. ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తమిళంలోనూ ఒక సినిమా చేసింది. ప్రస్తుతం ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది.