Movie News

ఎదుగుదల అంటే ఈ దర్శకుడిదే

ఇండస్ట్రీలో తొలి అవకాశం అందుకోవడానికి ముందు దర్శకులు పడే కష్టాలు ఎన్నెన్నో. ఇందుకోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అవకాశాలు వచ్చినట్లేవచ్చి చేజారిపోతాయి. కొన్నిసార్లు సినిమాలు మొదలై కూడా ఆగిపోతాయి. అయినా సరే ఓపికతో మన రోజు కోసం ఎదురు చూడాలి. అవకాశం వచ్చినపుడు తామేంటో రుజువు చేసుకోవాలి. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు.

రాత్రికి రాత్రే జీవితం మారిపోవచ్చు. కొన్నేళ్లలో ఎవ్వరూ ఊహించని స్థాయిని అందుకోవచ్చు. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌ది సరిగ్గా ఇలాంటి ప్రయాణమే. నెల్సన్ 12 ఏళ్ల కిందట శింబు హీరోగా ఒక సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాల్సింది. ఈ సినిమాను ప్రకటించాక ఏవో కారణాల వల్ల ఆగిపోయింది. దీంతో చాలా ఏళ్ల పాటు ఇంకో అవకాశం దక్కలేదు. చివరికి 2018లో అతను దర్శకుడిగా మారాడు. నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కోలమావు కోకిల’ నెల్సన్ తొలి చిత్రం.

హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిం అయినప్పటికీ మంచి ఎంటర్టైన్మెంట్‌తో సాగిన ఆ చిత్రం ఘనవిజయాన్నందుకుంది. దీంతో శివకార్తికేయన్ హీరోగా ‘డాక్టర్’ చేసే అవకాశం దక్కింది. ఈ సినిమా కొవిడ్ వల్ల బాగా ఆలస్యమైనా సరే.. విడుదలయ్యాక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఐతే ఈ సినిమా విడుదల కాకముందే దిలీప్‌కు ఒక భారీ అవకాశం వచ్చింది. ప్రస్తుతం తమిళంలో నంబర్ వన్ హీరో అనదగ్గ విజయ్‌తో సన్ పిక్చర్స్ లాంటి పెద్ద సంస్థలో ‘బీస్ట్’ లాంటి భారీ చిత్రం చేసే అవకాశం అందుకున్నాడు.

ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఏప్రిల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోపే దిలీప్ ఇంకా పెద్ద ఛాన్స్ అందుకున్నాడు. సౌత్ దర్శకుల్లో ప్రతి ఒక్కరూ సినిమా చేయాలని ఆశపడే సూపర్ స్టార్ రజినీకాంత్‌తో జట్టు కట్టబోతున్నాడు. ఈ చిత్రాన్ని కూడా సన్ పిక్చర్స్ వాళ్లే నిర్మిస్తున్నారు. గత కొన్నేళ్లలో రజినీ జోరు తగ్గినప్పటికీ సరైన సినిమా పడితే మళ్లీ ఆయన రైజ్ కావడం ఖాయం. నెల్సన్ లాంటి విలక్షణ దర్శకుడితో రజినీ సినిమా అనగానే అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మరి ఈ చిత్రంతో నెల్సన్ ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి.

This post was last modified on February 11, 2022 9:15 am

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

2 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

3 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

4 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

5 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

7 hours ago