టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇటీవల ‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ, బాలకృష్ణ ఇలా చాలా మంది హీరోలు బోయపాటి సినిమాల్లో నటించారు. ఇలాంటి డైరెక్టర్ కి ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉందట.
అదేంటంటే.. బూతులు మాట్లాడడం. ఈ విషయాన్ని సీనియర్ నటుడు జగపతి బాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఆయన సెట్ లో తెలియకుండానే బూతులు మాట్లాడుతుంటారట. మళ్లీ నెక్స్ట్ మినిట్ కూల్ అయిపోతుంటారట. కానీ అలాంటి పెద్ద డైరెక్టర్ సెట్ లో అలా బూతులు మాట్లాడడం ఎవరికీ నచ్చేది కాదట.
జగపతి బాబు కూడా బోయపాటి అలవాటు నచ్చక.. ఎప్పటికప్పుడు బూతులు తగ్గించుకోవాలని చెప్పేవారట. ఆయనతో కలిసి వర్క్ చేసిన కొందరు సీనియర్ హీరోలు కూడా బోయపాటి అదే సూచించడంతో.. అందరి మాటలు అర్ధం చేసుకున్న బోయపాటి ఇప్పుడు సెట్స్ లో బూతులు మాట్లాడడం తగ్గించేశారని జగపతి బాబు చెప్పుకొచ్చారు.
‘అఖండ’ సినిమా షూటింగ్ సమయంలో బోయపాటి శ్రీను చాలా కూల్ గా వర్క్ చేయడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని.. బోయపాటి అలా మారడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని జగపతి బాబు తెలిపారు.
అప్పటివరకు హీరోగా సినిమాలు చేసిన జగపతిబాబుని ‘లెజెండ్’ సినిమాలో విలన్ గా చూపించారు బోయపాటి. ఈ సినిమా తరువాత జగపతి బాబు కెరీర్ మలుపు తిరిగింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాల్లో ఆయనకు అవకాశాలు వస్తున్నాయి. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ చాలా బిజీ అయ్యారు. ‘అఖండ’ సినిమాలో కూడా స్వామిజీ పాత్రలో కనిపించారు జగపతి.
Gulte Telugu Telugu Political and Movie News Updates