మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన ర‌ష్మిక‌

టాలీవుడ్‌లో అన‌తి కాలంలోనే స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్న హీరోయిన్ల‌లో ర‌ష్మిక మంద‌న్నా ఒక‌రు. `ఛ‌లో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ క‌న్న‌డ సోయ‌గం.. ఫ‌స్ట్ మూవీతోనే మంచి హిట్‌ను ఖాతాలో వేసుకుని యూత్‌లో సూప‌ర్ క్రేజ్‌ను ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత మ‌రిన్ని ఆఫ‌ర్లు, వ‌రుస హిట్ల‌తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ర‌ష్మిక‌.. ప్ర‌స్తుతం సౌత్‌తో పాటు నార్త్‌లోనూ స‌త్తా చాటుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ర‌ష్మిక‌ను మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌రించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని పూర్తి చేసుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. త‌న 15వ చిత్రాన్ని శంక‌ర్‌తో ప్ర‌క‌టించాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లె సెట్స్ మీద‌కు కూడా వెళ్లింది.

ఇక ఈ మూవీ ఫినిష్ అయిన వెంట‌నే చ‌ర‌ణ్ `జెర్సీ` దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న సైతం వ‌చ్చింది. యు.వి.క్రియేష‌న్స్‌, ఎన్‌వి.ఆర్ సినిమా బ్యాన‌ర్ల‌పై ఈ సినిమా నిర్మితం కానుంది. అయితే ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడీగా ర‌ష్మికను తీసుకున్నార‌ట‌.

ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు ర‌ష్మిక‌ను సంప్ర‌దించ‌గా.. ఆమె వెంట‌నే ఓకే చెప్పింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే.. ఇక‌పై ర‌ష్మిక జోరును ఆప‌డం క‌ష్ట‌మే అంటున్నారు నెటిజ‌న్లు. కాగా, ర‌ష్మిక ప్ర‌స్తుతం తెలుగులో `పుష్ప ది రూల్‌`, `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాల‌తో పాటు హిందీలో `మిషన్ మజ్ను`, `గుడ్ బై` సినిమాలు కూడా చేస్తోంది. అలాగే మ‌రిన్ని ప్రాజెక్ట్స్ సైతం ర‌ష్మిక చేతిలో ఉన్నాయి.