అగ్ర దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా ఏడాది కిందట ఒక సినిమాను అనౌన్స్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అల్లు అర్జున్ మిత్రుడైన కేదార్ ఈ సినిమాను నిర్మించాల్సింది. అప్పట్లో ఈ సినిమా గురించి ఘనంగా ప్రకటించారు. కానీ హడావుడి అంతా ప్రకటన వరకే. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు అంగుళం కూడా ముందుకు కదిలింది లేదు. ఇటు సుకుమార్, అటు విజయ్ ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు.
ఇద్దరూ ఒక్కసారి కూడా కలిసి తమ కలయికలో రావాల్సిన సినిమా గురించి మాట్లాడుకున్న దాఖలాలు కూడా లేవు. సుకుమార్ పుష్ప సినిమాతో, విజయ్ లైగర్ మూవీతో బిజీగా ఉండబట్టే ఈ ప్రాజెక్టు గురించి చప్పుడు లేదేమో అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టులు రెండూ పూర్తయ్యాక కూడా వీరి కలయికలో సినిమా వచ్చే అవకాశం దాదాపుగా లేదనే అంటున్నారు ఇరువురి సన్నిహితులు.
సుకుమార్, విజయ్‌ల ఫ్యూచర్ ప్రాజెక్టుల సంగతి చూసినా.. వీరి కాంబినేషన్ అటకెక్కేసినట్లే కనిపిస్తోంది. పుష్ప-2 తర్వాత రామ్ చరణ్‌తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు సుకుమార్. పైగా తమిళ హీరో విజయ్‌తోనూ ఓ సినిమా చేసే ఛాన్సున్నట్లు వార్తలొస్తున్నాయి. సుకుమార్ చూపంతా టాప్ హీరోల మీదే ఉందన్నది స్పష్టం. ఇక విజయ్ సంగతి చూస్తే.. ప్రస్తుతం లైగర్ చేస్తున్న పూరీ జగన్నాథ్‌తోనే ఇంకో సినిమాను ఓకే చేసేశాడంటున్నారు.
లైగర్ అవ్వగానే ఇది పట్టాలెక్కేయబోతోంది. జాన్వి కపూర్ హీరోయిన్‌గా ఫిక్సయిందట. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తెరకెక్కనుందట. అతడికి శివ నిర్వాణతోనూ ఓ కమిట్మెంట్ ఉంది. దాని సంగతి కూడా తేల్చట్లేదు. మొత్తానికి చూస్తుంటే ఇలా ఇద్దరూ వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తున్న సంగతి స్పష్టం. ఇద్దరి లైనప్ చూస్తుంటే సమీప భవిష్యత్తులో కలిసి సినిమా చేయడం సందేహంగానే కనిపిస్తోంది.
This post was last modified on January 27, 2022 9:41 am
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…