కమర్షియల్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఫెయిలైంది తాప్సీ. ఇక్కడ హీరోల పక్కన గ్లామర్‌ని ఒలికించడానికి మాత్రమే తనకి చాన్స్ దొరికింది. కానీ బాలీవుడ్‌లో ఆమె ఎంట్రీ ఓ సెన్సేషనే అయ్యింది. ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటి ఇవాళ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనిపించుకుంటోంది.
సంవత్సరానికి కనీసం రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తోంది తాప్సీ. ఈ యేడు ఆమె నటించిన రెండు సినిమాలు అప్పుడే రిలీజ్‌కి రెడీ అయ్యాయి. వాటిలో ఒకటి.. ప్రముఖ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ ‘శభాష్ మిథూ’. రెండోది.. క్రైమ్ థ్రిల్లర్ ‘లూప్ లపేటా’. తాహిర్ రాజ్ భాసిన్‌తో కలిసి ఆకాష్ భాటియా దర్శకత్వంలో తాప్సీ నటించిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. కంప్లీట్‌గా తాప్సీ స్టైల్‌లో ఉండి ఆకట్టుకుంది.
జర్మన్ ఎక్స్‌పెరిమెంటల్ థ్రిల్లర్ ‘రన్ లోలా రన్’కి ఇది అఫీషియల్ రీమేక్. ఫిబ్రవరి 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తిన్న ఓ అమ్మాయి. ఆమె బాధల్ని మరిపించిన ఓ అబ్బాయి. అనుకోకుండా బెట్టింగ్ మాఫియాలో ఇరుక్కుంటాడు తను. యాభై నిమిషాల్లో యాభై లక్షలు ఇవ్వకపోతే ప్రాణాలు పోతాయి. అలాంటి పరిస్థితుల నుంచి ప్రియుణ్ని ఆ అమ్మాయి ఎలా కాపాడుకుందనేది కథ.
లవర్ కోసం ప్రాణాలకు తెగించే సవీ పాత్రలో తాప్సీ ఒదిగిపోయింది. మోడర్న్ లుక్.. కేర్‌లెస్ బిహేవియర్‌తో డేర్ డెవిల్‌లా కనిపిస్తోంది. పొట్టి పొట్టి డ్రెస్సులతో కనుల విందు చేయడమే కాదు.. రొమాన్స్‌ని కూడా బాగా పండించింది. గతంలోనూ మన్‌మర్జియా, హసీన్ దిల్‌రుబా లాంటి చిత్రాల్లో హాట్ సీన్స్ చేసింది తాప్సీ. అయితే ఈ సినిమాలో కాస్త డోస్ పెంచినట్టే అనిపిస్తోంది. ట్రైలర్‌లోనే ఇన్ని లిప్ లాకులు, ఇంటిమేట్ సీన్లు కనిపించాయంటే.. ఇక సినిమాలో తాప్సీ రొమాంటిక్ ట్రీట్ ఏ రేంజ్‌లో ఉంటుందో.
This post was last modified on January 13, 2022 4:26 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…