Movie News

బాలయ్యకు అలా.. బన్నీకి ఇలా.. మరి నాగ్‌కు ఎలా?

అయిన వాడికి ఆకులో కాని వాడికి కంచంలో.. అని తెలుగులో ఒక సామెత. సినిమా వాళ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటోందిప్పుడు. దేశంలో మిగతా రాష్ట్రాల మాదిరే ఏపీలోనూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతం తగ్గించాలని, అలాగే నైట్ కర్ఫ్యూ పెట్టి సెకండ్ షోలు రద్దు చేయాలని నిర్ణయించారు ముందుగా. కానీ తర్వాత ఈ నిర్ణయాలను వాయిదా వేశారు.

ఏపీ సీఎం జగన్‌కు సన్నిహితుడైన నాగార్జున తన కొత్త చిత్రం బంగార్రాజును సంక్రాంతి రేసులో నిలిపిన నేపథ్యంలో ఈ నిర్ణయాల్ని మార్చుకున్నట్లుగా భావిస్తున్నారు. ‘బంగార్రాజు’ తప్పుకుని ఏ పవన్ కళ్యాణ్ సినిమానో, మరో మెగా హీరో మూవీనో సంక్రాంతికి రిలీజై ఉంటే కచ్చితంగా ఈ నిబంధనలు అమలయ్యేవన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే పరిస్థితులు ‘బంగార్రాజు’కు బాగా అనుకూలంగా కనిపిస్తున్న మాట వాస్తవం.

కాగా ఇప్పుడు ‘బంగార్రాజు’ స్పెషల్ షోల గురించి చర్చ నడుస్తోంది. ఏపీలో రోజులో నాలుగు షోలకు మించి వేయడానికి వీల్లేదు. బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు రద్దయ్యాయి. ఐతే ఈ విషయంలో పూర్తి కట్టుదిట్టంగా అయితే వ్యవహరించట్లేదు. గత నెలలో వచ్చిన రెండు భారీ చిత్రాలకు భిన్నమైన వైఖరి అవలంభించారు. ‘అఖండ’ మూవీకి ఆంధ్రప్రదేశ్ అంతటా బెనిఫిట్ షోలు పెద్ద ఎత్తున పడ్డాయి. తొలి రోజు ఐదు షోల చొప్పున నడిపించారు. ఈ చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రతి పక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే అయినప్పటికీ.. జగన్‌కు ఆయన పట్ల సానుకూల వైఖరి ఉందని, అందుకే ‘అఖండ’ బెనిఫిట్ షోల విషయంలో చూసీ చూడనట్లు ఉన్నారనే వ్యాఖ్యలు వినిపించాయి.

ఐతే ఇంకో రెండు వారాల తర్వాత వచ్చిన ‘పుష్ఫ’కు వచ్చేసరికి కథ మారిపోయింది. దానికి పట్టుబట్టి బెనిఫిట్ షోలు ఆపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా మార్నింగ్ షోల కంటే ముందు బొమ్మ పడలేదు. ‘అఖండ’కు అవకాశమిచ్చి ‘పుష్ప’కు ఇంత కఠినంగా వ్యవహరించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఇప్పుడు జగన్ సన్నిహితుడైన నాగ్ సినిమా విషయంలో ఏం జరగబోతోందన్నది ఆసక్తికరం. బాలయ్య, బన్నీలకున్న క్రేజ్ నాగ్‌కు లేని మాట వాస్తవం. గత కొన్నేళ్లలో ఆయన మార్కెట్ బాగా దెబ్బ తినేసింది కూడా. కానీ ‘బంగార్రాజు’కు మాత్రం హైప్ బాగానే ఉంది. పైగా ఈ చిత్రం సంక్రాంతికి రిలీజవుతోంది. మరి అభిమానులు స్పెషల్ షోల మీద ఆశలు పెట్టుకుని, అందుకోసం ఏర్పాట్లు చేసుకుంటే ప్రభుత్వం ఏమైనా సహకరిస్తుందా అన్నది చూడాలి.

This post was last modified on January 13, 2022 3:14 pm

Share

Recent Posts

నిన్న సందీప్ వంగ… నేడు శ్రీకాంత్ ఓదెల

మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…

3 hours ago

అమితాబ్ టెక్నిక్ ఫాలో అయితే… మీ స‌తీమ‌ణి టైమ్‌కి రెడీ!

ఏదైనా పెళ్లో.. మ‌రో ఫంక్ష‌నో.. భార్యా భ‌ర్త‌లు ఇరువురు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు.. స‌హ‌జంగా దంప‌తుల్లో ఉత్సాహం ఉంటుంది. భ‌ర్త ముందుగానే…

10 hours ago

లెక్క తప్పుతున్న యూత్ సినిమాలు

యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…

11 hours ago

దీపావళికి డబ్బింగుల జోరు… టాలీవుడ్ హీరోలు లేరు

నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…

12 hours ago

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

17 hours ago