Movie News

మెగా ఆల్లుడితో.. పాపం ఆ నిర్మాత

కళ్యాణ్ దేవ్ అనే ఓ కొత్త కుర్రాడు హీరో అయ్యాడన్నా.. కాస్త మంచి బడ్జెట్లోనే సినిమాలు తెరకెక్కాయన్నా.. అందుక్కారణం అతను మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కావడం వల్లే. అతను హీరోగా మూడు సినిమాలు తెరకెక్కగా.. ఆ మూడూ బయటి నిర్మాతలే తీశారు. చిరు అల్లుడితో సినిమా తీస్తే తమకు ఇండస్ట్రీలో మంచి ప్రోత్సాహం ఉంటుందని వారు భావించి ఉండొచ్చు. ఐతే కళ్యాణ్ హీరోగా నటించిన తొలి సినిమా ‘విజేత’ పూర్తిగా నిరాశపరిచింది. తర్వాత అతను కథానాయకుడిగా సూపర్ మచ్చి, కిన్నెరసాని సినిమాలు తెరకెక్కాయి.

ఇందులో సూపర్ మచ్చి చాన్నాళ్ల ముందే పూర్తయింది. కానీ విడుదలకు నోచుకోలేకపోయింది. ఈలోపే కిన్నెరసాని కూడా పూర్తి చేశాడు కళ్యాణ్. ఆ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ మిత్రుడైన రామ్ తాళ్లూరి నిర్మించాడు. ఆయన ఒక స్థాయి ఉన్న నిర్మాత. సినిమా కూడా డిఫరెంట్‌గా కనిపిస్తోంది. దాన్ని బాగానే ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఎటొచ్చీ ‘సూపర్ మచ్చి’ పరిస్థితే అయోమయంగా మారింది.ఈ సినిమా చాలా రోజులుగా వార్తల్లో లేదు.

ఉన్నట్లుండి సంక్రాంతికి విడుదల అన్నారు. కానీ హీరో ఈ సినిమాతో తనకే సంబంధం లేదన్నట్లుగా ఉండిపోయాడు. తాజాగా లాంచ్ చేసిన ట్రైలర్ చూస్తే కళ్యాణ్ దేవ్ తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పలేదని అర్థమైంది. వేరెవరితోనూ డబ్బింగ్ చెప్పించి సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. కానీ ప్రమోషన్ పరంగా దీనికి కళ్యాణ్ నుంచి ఎలాంటి సహకారం లేకపోవడం మైనస్ అయింది. కళ్యాణ్ తొలి చిత్రానికి మెగా ఫ్యామిలీలో అందరి నుంచి మంచి సపోర్ట్ లభించింది.

దాన్ని వాళ్లు ట్విట్టర్లో బాగా ప్రమోట్ చేశారు. మీడియా నుంచి కూడా సహకారం అందింది. సినిమా సరిగా ఆడకపోయినా ప్రి రిలీజ్ బజ్ పర్వాలేదు. కానీ ‘సూపర్ మచ్చి’ని హీరోనే పక్కన పెట్టేశాడు. మెగా ఫ్యామిలీ నుంచి అస్సలు దీన్ని పట్టించుకోలేదు. ఏదో రిలీజ్ అవుతోందంటే అవుతోందీ చిత్రం. తమన్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌ను.. వేరే క్వాలిటీ టెక్నీషియన్లు, ఆర్టిస్టులను పెట్టుకుని మంచి బడ్జెట్లోనే సినిమా తీసినట్లున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మొత్తం పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరయ్యేలా ఉంది.

This post was last modified on January 13, 2022 8:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

24 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago