యంగ్ హీరోలకు హీరోయిన్స్‌ని సెట్ చేయడం పెద్ద కష్టం కాదు కానీ సీనియర్ హీరోలతోనే సమస్య. యాభై దాటినా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే హీరోలకి, వారి పర్సనాలిటీకి తగిన హీరోయిన్‌ని కుదుర్చుకోవడం కాస్త కష్టంగానే ఉంది. ఈ సమస్యను బాలకృష్ణ చాలాకాలంగా ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్‌కి కూడా సేమ్ ప్రాబ్లెమ్ వస్తోంది.
గాడ్ ఫాదర్, భోళాశంకర్ చిత్రాలతో పాటు బాబి, వెంకీ కుడుముల డైరెక్షన్‌లోనూ సినిమాలు చేయబోతున్నారు చిరంజీవి. ‘ఆచార్య’తో మొదలైన హీరోయిన్ల సమస్య ఈ సినిమాలన్నింటినీ వెంటాడుతోంది. నిజానికి ‘ఆచార్య’ మూవీకి హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలా అని పెద్ద చర్చే జరిగింది. కానీ చిరు ఇమేజ్‌కి, ఏజ్‌కి, పర్సనాలిటీకి సూటయ్యే హీరోయిన్ కావాలి కాబట్టి, ‘ఖైదీ నంబర్ 150’లో చేసిన కాజల్‌నే రిపీట్ చేశారు.
‘గాడ్‌ఫాదర్’ స్క్రిప్ట్ ప్రకారం హీరోకి జోడీ ఉండదు. కానీ ఇక్కడ ఉన్నది మోహన్‌లాల్ కాదు, చిరంజీవి. హీరోయిన్ లేకపోతే మెగా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయరేమోననే డౌట్‌తో హీరోయిన్ పాత్రని క్రియేట్ చేస్తున్నాడట మోహన్ రాజా. ఆ క్యారెక్టర్ అనుష్క చేయబోతోందనే వార్తలు ఆమధ్య వచ్చాయి. కానీ టీమ్ అయితే ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు. మెహెర్ రమేష్ తీస్తున్న ‘భోళాశంకర్’లో హీరోయిన్‌గా ‘సైరా’లో నటించిన తమన్నాని రిపీట్ చేస్తున్నారు. బాబి సినిమా కోసం శ్రుతీహాసన్‌ని తీసుకోనున్నట్లు ఇటీవలే తెలిసింది.
ఇక మిగిలింది వెంకీ చిత్రం. ఈ మూవీలో హీరోయిన్‌గా అనుష్కని ఫైనల్ చేశారనేది లేటెస్ట్ టాక్. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని కూడా అంటున్నారు. అలా అయితే ‘గాడ్‌ఫాదర్’ కోసం స్వీటీని సెట్ చేశారనే వార్త నిజం కానట్టేనా? లేక రెండింటిలోనూ అనుష్క యాక్ట్ చేస్తుందా? ప్రస్తుతానికైతే వీటికి ఆన్సర్ లేదు. కానీ అనుష్క పేరైతే స్ట్రాంగ్‌గా వినిపిస్తోంది. ఆప్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి మెగాస్టార్ సరసన ఏదో ఒక మూవీలో అయితే ఆమె కనిపించడం ఖాయమనిపిస్తోంది.
This post was last modified on January 12, 2022 2:22 pm
టాలీవుడ్లో బాక్సాఫీస్ స్లంప్ వచ్చినపుడల్లా.. నిర్మాతల దృష్టి రివ్యూల మీద పడుతోంది. సినిమాలు దెబ్బ తినడానికి రివ్యూలే కారణమంటూ వాటి…
ఇంకో శుక్రవారం వచ్చేస్తోంది. లాస్ట్ వీక్ భారీ అంచనాల మధ్య వచ్చిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి, ఓదెల 2 ఆశించిన…
ఇంకో ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ కోసం నాని చేస్తున్న ప్రమోషన్లు జాతీయ…
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీప్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై విపక్ష వైసీపీ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు వైసీపీ కీలక…
ఏడాదికి పైగా వెయిట్ చేసి మరీ అర్జున్ సన్నాఫ్ వైజయంతితో ప్రేక్షకుల ముందుకొచ్చిన కళ్యాణ్ రామ్ తాను కోరుకున్న స్థాయిలో…
నాయకులన్నాక.. ప్రజల మధ్య చర్చ ఉంటుంది. వారిచ్చే మార్కులు కూడా అవసరం. ఒకప్పుడు నాయ కులు.. ప్రజల ఆలోచనలు వేరేగా…