కొన్ని వారాల నుంచి ఇండియన్ బాక్సాఫీస్‌లో చర్చలన్నీ పుష్ప చుట్టూనే తిరుగుతున్నాయి. డివైడ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా అంచనాల్ని మించి అద్భుత వసూళ్లతో దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్లు రాబట్టడం విశేషం ఏమీ కాదు. కానీ పెద్దగా ప్రమోషన్లేమీ చేయకుండానే హిందీలో ఈ చిత్రం వసూళ్ల మోత మోగిస్తోంది.
తమిళం, మలయాళంలోనూ పుష్పకు భారీ వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా హిందీలో పుష్ప రోజు వారీ వసూళ్ల గురించి, ఓవరాల్ ఫిగర్స్ గురించి ఆశ్చర్యపోతున్నారు అక్కడి ట్రేడ్ పండిట్లు. ఐతే ఇలా అందరూ పుష్ప గురించి మాట్లాడుకుంటుంటే.. ఓ సినిమా సైలెంటుగా కలెక్షన్లు కొల్లగొడుతూ సాగుతోంది. ఇప్పుడా సినిమా ఇండియా వసూళ్ల లెక్క చూసి అందరికీ దిమ్మదిరుగుతోంది.
ఆ చిత్రం స్పైడర్ మ్యాన్: నో వే హోమ్. ఈ సినిమా ఇండియాలో ఇప్పటిదాకా రూ.260 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. పుష్ప మూవీ కంటే ఒక్క రోజు ముందు రిలీజైన స్పైడర్ మ్యాన్ తొలి వారాంతంలోనే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. పుష్ప, 83 చిత్రాల పోటీని తట్టుకుని తర్వాతి రోజుల్లో కూడా నిలకడగా కలెక్షన్లు రాబట్టింది. చూస్తుండగానే కలెక్షన్లు రూ.200 కోట్లు, రూ.250 కోట్లు దాటిపోయాయి.
ఇప్పుడు ఈ సినిమా రూ.300 గ్రాస్ మార్కుపై కన్నేసింది. జెర్సీ, ఆర్ఆర్ఆర్ వాయిదా పడటంతో ఇదేమీ కష్టమైన టార్గెట్ లాగా కనిపించడం లేదు. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన హాలీవుడ్ మూవీగా ఇది నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరల్డ్ వైడ్ ఈ సినిమా వసూళ్లు మూడో వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.10 వేల కోట్ల మార్కును దాటేశాయి. మొత్తం కలెక్షన్లు రూ.10,200 కోట్లట. మరి కొన్ని రోజుల పాటు వరల్డ్ వైడ్ స్పైడర్ మ్యాన్ ప్రభంజనం కొనసాగేలాగే కనిపిస్తోంది.
This post was last modified on January 3, 2022 10:20 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…