ఒక కథానాయికకు కాస్త వయసు మీద పడగానే పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అన్న ప్రశ్నలు మొదలవుతాయి. పెళ్లి చేసుకున్నాకేమో తల్లయ్యేదెప్పుడు తల్లయ్యేదెప్పుడు అని ప్రశ్నలు కురిపిస్తారు. ఐతే కరోనా టైంలో ఉన్నట్లుండి పెళ్లికి రెడీ అయిపోయి అందరికీ పెద్ద షాకిచ్చిన కాజల్ అగర్వాల్.. బిడ్డకు జన్మనిచ్చే విషయంలో ఎక్కువ సమయం ఏమీ తీసుకోలేదు. కరోనా ఫస్ట్ వేవ్ టైంకి పెళ్లి చేసుకున్న ఆమె.. థర్డ్ వేవ్ సమయానికి ప్రెగ్నెంట్ అయిపోయింది.
కాకపోతే ఈ విషయం ఇప్పటిదాకా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి.. చేయాల్సి ఉన్న సినిమాలను వదులుకోవడంతోనే కాజల్ ప్రెగ్నెంట్ అనే విషయం ఖరారైపోయింది. కాకపోతే అధికారికంగా ఈ విషయం ఎప్పుడు చెబుతారా అనే అంతా ఎదురు చూశారు. ఐతే దీనిపై స్టేట్మెంట్ ఇవ్వలేదు కానీ.. విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు కాజల్ భర్త గౌతమ్ కిచ్లు.
కొత్త సంవత్సరం ఆరంభమైన సందర్భంగా గౌతమ్.. కాజల్‌తో కలిసి ఉన్న ఒక అందమైన ఫొటోను షేర్ చేశాడు. అందులో కొద్దిగా కాజల్ బేబీ బంప్ కనిపిస్తోంది. దీనికి తోడు.. ‘‘ఇదిగో 2022.. నీవైపే చూస్తున్నాం’’ అంటూ కామెంట్ పెట్టిన గౌతమ్.. ప్రెగ్నెంట్ లేడీ ఎమోజీని కూడా జోడించాడు. తద్వారా కాజల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు. ఐతే ఇలా ఇన్‌డైరెక్ట్ మెసేజ్‌లు ఎందుకు.. నేరుగా అనౌన్స్‌మెంట్ ఇవ్వొచ్చు కదా అని నెటిజన్లు ఆ పోస్టుకు కామెంట్లు పెట్టారు.
మొత్తానికి కెరీర్ మంచి ఊపులో ఉండగానే పెళ్లి చేసుకోవడమే కాదు.. చేతిలో ఉన్న మంచి ప్రాజెక్టులను వదులుకుని మరీ బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమవడం ద్వారా కాజల్ తాను ప్రత్యేకమని చాటిచెప్పింది. నాగార్జునతో చేయాల్సిన ‘ఘోస్ట్’తో పాటు.. కమల్ హాసన్ సరసన నటిస్తున్న ‘ఇండియన్-2’ను కూడా కాజల్ వదులుకున్న సంగతి తెలిసిందే. ఆమె లీడ్ రోల్ చేసిన హిందీ మూవీ ‘ఉమ’ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
This post was last modified on January 2, 2022 2:16 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…