ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా ఫస్ట్ పార్ట్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. వసూళ్ల పరంగా మాత్రం సత్తా చాటుతోంది. బీ, సీ ఆడియన్స్ ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు ‘పుష్ప’ పార్ట్ 2 రాబోతుంది. ‘పుష్ప ది రూల్’ అనే పేరుతో సెకండ్ పార్ట్ తెరకెక్కుతోంది.
ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని నిర్మాతలు వెల్లడించారు.
స్క్రిప్ట్ మొత్తం రెడీగా ఉండడంతో ఈసారి సుకుమార్ ఎక్కువ సమయం తీసుకోరని చెబుతున్నారు. ఈ విషయంలో బన్నీకి డెడ్ లైన్ కూడా విధించినట్లు తెలుస్తోంది. వంద రోజుల్లో షూటింగ్ ను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారట సుకుమార్.
2022కి ఎట్టిపరిస్థితుల్లో ‘పుష్ప ది రూల్’ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు సెకండ్ పార్ట్ కి సంబంధించిన సన్నివేశాలను తీయలేదట. మొత్తం కొత్త సినిమాగా దీన్ని తెరకెక్కించాలి. బన్నీ డేట్స్ రెడీగా ఉన్నాయి. విలన్ గా నటించిన ఫహద్ ఫాజిల్ డేట్స్ ఎక్కువగా కావాల్సివుంది. ఆయన మలయాళంలో స్టార్ హీరో కాబట్టి కాస్త బిజీగా ఉంటారు. ఆయన డేట్స్ ని బట్టి మిగిలిన నటీనటుల డేట్స్ ని కూడా ఫిక్స్ చేయనున్నారు.
నిజానికి పార్టీ 2లో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉండేలా కథ రాసుకున్నారట. కానీ ఇప్పుడు దాని డోస్ తగ్గించబోతున్నారని తెలుస్తోంది. అలానే బన్నీ-రష్మికల మధ్య ట్రాక్ పై కూడా వర్క్ చేయాల్సివుంది. కథలో కొన్ని రా సీన్లు ఉండేలా చూసుకుంటున్నాడు సుకుమార్. ఫిబ్రవరి వరకు సమయం ఉంది కాబట్టి సుకుమార్ ఈలోగా స్క్రిప్ట్ ను మరింత పకడ్బందీగా సిద్ధం చేయనున్నారు.
This post was last modified on December 27, 2021 1:26 pm
ఆర్కే రోజా పేరు వింటేనే కూటమి పార్టీలు అంతెత్తున ఎగిరి పడుతున్నాయి. వైసీపీ అదికారంలో ఉండగా.. టీడీపీ, జనసేనలపై ఓ…
కంచే గచ్చిబౌలి భూముల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా…
పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నట్లే కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడ కూడా ఇరు రాష్ట్రాల మధ్య…
ఏపీ ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వాన్ని చక్కటి సమన్వయంతో ముందుకు నడిపిస్తున్న చంద్రబాబుకు 10 నెలలు పూర్తయ్యాయి. గత ఏడాది జూన్…
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…