Movie News

చేతులెత్తేసిన ‘శ్యామ్ సింగ రాయ్’ డిస్ట్రిబ్యూటర్

‘శ్యామ్ సింగ రాయ్’ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా. అతడి మార్కెట్ స్థాయికి మించి ఈ సినిమాకు ఖర్చు పెట్టాడు కొత్త నిర్మాత వెంకట్ బోయనపల్లి. మామూలుగానే ఇది పెద్ద బడ్జెట్ సినిమా కాగా.. కరోనా వల్ల మేకింగ్ ఆలస్యం కావడం.. మధ్యలో వర్షాలకు కోట్ల రూపాయలతో వేసిన సెట్ దెబ్బ తినడం వంటి కారణాలతో ఖర్చు ఇంకా పెరిగింది. ఇంకోవైపేమో నాని గత రెండు చిత్రాలు వి, టక్ జగదీష్ నిరాశ పరచడం ‘శ్యామ్ సింగ రాయ్’కి ప్రతికూలమైంది.

ఇవన్నీ చాలవన్నట్లు అఖండ, పుష్ప లాంటి భారీ చిత్రాల తర్వాత.. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా మూవీకి ముందు రావడం వల్ల రిలీజ్ టైమింగ్ కూడా ‘శ్యామ్ సింగ రాయ్’కి సరిగా కుదరలేదు. దీంతో సినిమాకు బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగలేదు. కొంచెం డెఫిషిట్‌తోనే సినిమాను రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది నిర్మాతకు. వీటన్నింటికీ తోడు ఇప్పుడు ఇంకో సమస్య వచ్చి పడింది.ఏపీలో మామూలుగానే థియేటర్ల పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటే.. ‘శ్యామ్ సింగ రాయ్’ రిలీజ్ ముందు రోజు నాని అక్కడి టికెట్ల రేట్ల గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

ప్రభుత్వాన్ని తప్పుబట్టేలా ఆ వ్యాఖ్యలు ఉండటంతో మంత్రులకు మండిపోయింది. సీఎం జగన్‌ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఏపీలో థియేటర్ల మీద జరుగుతున్న దాడుల్ని అధికారులు మరింత ఉద్ధృతం చేశారు. నిబంధనల ఉల్లంఘన పేరుతో పదుల సంఖ్యలో థియేటర్లను సీజ్ చేశారు. వాటిలో మెజారిటీ శ్యామ్ సింగ రాయ్ థియేటర్లే ఉన్నాయట.

శుక్రవారం కూడా దాడులు కొనసాగుుతున్నాయి. థియేటర్లు మూతపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘శ్యామ్ సింగ రాయ్’ డిస్ట్రిబ్యూటర్ చేతులెత్తేసినట్లు సమాచారం. నిర్మాత అడిగిన మేర డబ్బులు కట్టి తాను సినిమాను రిలీజ్ చేసి నష్టాల పాలవ్వలేనంటూ అతను వెనక్కి తగ్గాడట. దీంతో ఆల్రెడీ బుక్ అయిన థియేటర్లలో నిర్మాత సొంతంగా సినిమాను రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందట. ఐతే ఇప్పటికే టికెట్ల రేట్ల ప్రతికూల ప్రభావం ఉండగా.. ఇప్పుడు థియేటర్ల కోత పడటంతో నిర్మాతకు గట్టిగానే దెబ్బ పడటం ఖాయమని అంటున్నారు.

This post was last modified on December 24, 2021 3:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

5 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

5 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

6 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

7 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

8 hours ago