మొత్తానికి రెండు నెలలుగా నడుస్తున్న సస్పెన్సుకి ఎట్టకేలకు తెరపడింది. సంక్రాంతి బరిలో ఉన్న ‘భీమ్లా నాయక్’ ఎట్టకేలకు రేసు నుంచి తప్పుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని సంక్రాంతి రేసు నుంచి తప్పించేదే లేదని భీష్మించుకుని కూర్చున్న నిర్మాత తలవంచక తప్పలేదు. దిల్ రాజు సహా కొందరు పెద్దలు పవన్ కళ్యాణ్‌ను వాయిదాకు ఒప్పించడంతో నిర్మాత తగ్గక తప్పలేదు. ఈ విషయంలో తన నిస్సహాయతను నాగవంశీ వ్యక్తం చేస్తూ పవన్ అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పాడు.
‘ఆర్ఆర్ఆర్’తో పోటీ పడటం ‘భీమ్లా నాయక్’కు కొంత ఇబ్బంది కరమే అయినా, థియేటర్ల సమస్య కూడా తప్పదని తెలిసినా సంక్రాంతికే రావాలని ‘భీమ్లా నాయక్’ టీం పట్టుబడటానికి కొన్ని కారణాలున్నాయి. మిగతా ఏ సీజన్‌తో పోల్చినా తెలుగులో సంక్రాంతి సినిమాలకు ఉండే ఆదరణ వేరు. తెలుగు ప్రేక్షకులు ఆ టైంలో విపరీతంగా సినిమాలు చూస్తారు. అందుకే మామూలు టైంతో పోలిస్తే భారీ వసూళ్లు వస్తాయి. దీనికి తోడు ఏపీలో జగన్ ప్రభుత్వం వేరే టైంలో వస్తే పవన్ సినిమాను ఇబ్బంది పెట్టడానికి చూస్తుందన్న అనుమానాలున్నాయి.
కాబట్టి సంక్రాంతికి వేరే సినిమాలతో కలిసి వస్తే దాన్ని ఇరుకున పెట్టడానికి ఉండదు. అందుకే సంక్రాంతి రిలీజ్ కోసం ‘భీమ్లా నాయక్’ పట్టుబట్టింది. కానీ ఏదో ఒకటి చేసి ఆ సినిమాను సంక్రాంతి రేసు నుంచి తప్పించారు. ఫిబ్రవరి 25న శివరాత్రికి స్లాట్ కేటాయించారు. దీని కోసమని తమ ‘ఎఫ్-3’ డేట్‌ను త్యాగం చేసినట్లు నిర్మాత దిల్ రాజు చెబుతున్నారు. ఐతే శివరాత్రి సెలవు రోజు రిలీజ్ అన్నది తప్పితే ఆ డేట్‌కు ఏ ఆకర్షణా లేదు. ఫిబ్రవరిలో విద్యార్థులంతా పరీక్షల హడావుడిలో ఉంటారు. ఆ టైంలో మామూలు కన్నా వసూళ్లు తక్కువ ఉంటాయి. సంక్రాంతి అడ్వాంటేజ్ పోవడమే కాదు.. మామూలు రోజుల్లో ఉండే వసూళ్లు కూడా అప్పుడు ఉంటాయన్న గ్యారెంటీ లేదు.
ఇవన్నీ పక్కన పెడితే.. సంక్రాంతి సినిమాల మధ్యన కాకుండా సోలోగా రాబోతున్న ‘భీమ్లా నాయక్’ను జగన్ సర్కారు ఏదో ఒక రకంగా టార్గెట్ చేస్తుందన్న అనుమానాలు ఉన్నాయి. సంక్రాంతి సినిమాలకు టికెట్ల ధరల్లో మినహాయింపులిస్తారేమో, అదనపు షోలు, బెనిఫిట్ షోల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తారేమో అంటున్నారు. ఇలా వాటికి పరోక్షంగా సహకరించి ‘భీమ్లా నాయక్’కు నిబంధనలు కఠినతరం చేస్తే, థియేటర్ల మీద కక్ష పూరితంగా దాడులు చేస్తే.. ఇప్పుడు సినిమాను వాయిదా వేయించిన పెద్దలు అప్పుడు గళం విప్పుతారా.. ఆ సినిమా కోసం పోరాడతారా.. దానికి మేలు చేయడానికి ప్రయత్నిస్తారా అన్నదే సందేహంగా ఉంది.
This post was last modified on December 23, 2021 8:53 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…