నటసింహ నందమూరి బాలకృష్ణకు, మాస్ రాజా రవితేజకు ఏవో విభేదాలున్నాయన్నది ఈ నాటి మాట కాదు. ఈ విషయంలో రకరకాల రూమర్లు వినిపించాయి. అవి ఒక దశలో శ్రుతి మించి ఒక కథానాయికను రవితేజ ఇబ్బంది పెడితే బాలయ్య వార్నింగ్ ఇచ్చేశాడని, చేయి చేసుకున్నాడని కూడా ఒక రూమర్ ప్రచారంలోకి రావడం గమనార్హం. ఇది వినడానికే పెద్ద గాలి కబురులా అనిపించినా.. రూమర్ రాయుళ్లు ఇలాంటి వాటినే విపరీతంగా ప్రచారం చేసి వదిలేశారు.
దీనికి తోడు బాలయ్య, రవితేజ బయట ఎక్కడా కలిసి కనిపించకపోవడం.. వీరి మధ్య బాక్సాఫీస్ పోరులో కొన్నిసార్లు రవితేజ పైచేయి సాధించడంతో ఆ రూమర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఐతే ఎట్టకేలకు ఈ పుకార్లకు ఈ ఇద్దరు హీరోలు కలిసే చెక్ పెట్టేశారు. బాలయ్య హోస్ట్ చేసే అన్ స్టాపబుల్ షోకు కొత్త అతిథిగా రవితేజ హాజరైన సంగతి తెలిసిందే.
ఈ ఎపిసోడ్ ప్రిమియర్స్ డిసెంబరు 31న పడనుండగా.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు.
అందులో ఆరంభంలోనే బాలయ్య పై రూమర్లకు క్లారిటీ ఇచ్చేశాడు. షోలోకి వెళ్లే ముందు ఒక క్లారిటీ తెచ్చేసుకుందాం అంటూ.. నీకూ నాకు పెద్ద గొడవైందటగా అని బాలయ్య అడగ్గా రవితేజ గట్టిగా నవ్వేశాడు. పనీపాటా లేని డ్యాష్ గాళ్లు ఇలాంటివి ప్రచారం చేస్తుంటారని తేలిగ్గా కొట్టిపారేశాడు. ఆ తర్వాత బాలయ్య, రవితేజ కలిసి షోలో చేయాల్సిన అల్లరంతా చేసేశారు. యుక్త వయసులో రవితేజ అమ్మాయిలకు లైనేయడం దగ్గరనుంచి కొన్ని ఆసక్తికర విషయాలను తీసుకొచ్చి మాస్ రాజా ముందుంచాడు బాలయ్య.
ఈ షో మధ్యలో దర్శకుడు గోపీచంద్ మలినేని ఎంట్రీ ఇచ్చాడు. సమరసింహారెడ్డి సినిమా కోసమని తాను అరెస్టయిన విషయాన్ని అతను గుర్తు చేసుకున్నాడు. రవితేజకు రెండు బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన గోపీచంద్ తనకు కూడా బ్లాక్‌బస్టర్ ఇవ్వాలని.. లేకుంటే పొడిచేస్తానని బాలయ్య జోక్ చేయడం విశేషం. చివర్లో డ్రగ్స్ కేసు గురించి అడిగినపుడు రవితేజ కొంత ఎమోషనల్ అయ్యాడు. చివర్లో అఖండలోని జై బాలయ్యా పాటకు రవితేజ స్టెప్పులేయడం విశేషం.
This post was last modified on December 22, 2021 11:43 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…