అతి సర్వత్ర వర్జయేత్ అన్న నానుడి గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా మోతాదు మించితే ప్రేక్షకులకు మొహం మొత్తేస్తుంది. ప్రొ కబడ్డీ లీగ్‌కు అనూహ్యమైన ఆదరణ రావడంతో అత్యాశకు పోయిన నిర్వాహకులు ఒకే ఏడాది రెండు సీజన్లలో ఈ లీగ్‌ను నిర్వహించి ఆదాయం పెంచుకోవాలని చూశారు. కానీ మోతాదు ఎక్కువైపోవడంతో ప్రేక్షకులకు కబడ్డీ లీగ్ మీద ఆసక్తి తగ్గిపోయింది. టోర్నీకి ఆదరణ పడిపోయింది.
ఇప్పుడు మళ్లీ పుంజుకోవడానికి నానా కష్టాలు పడుతోందీ లీగ్. పోయినేడాది కరోనా వల్ల సంవత్సరం చివర్లో ఐపీఎల్ నిర్వహించి.. మళ్లీ ఏప్రిల్లో షెడ్యూల్ ప్రకారం కొత్త సీజన్‌ను ఆరంభిస్తే ప్రేక్షకుల్లో అంతగా ఆసక్తి కనిపించలేదు. క్రీడల విషయంలోనే కాదు.. ఎందులోనైనా సరే మోతాదు ఎక్కువ అయితే అలాగే ఉంటుంది. జనాలకు మొహం మొత్తేస్తుంది. ఈ విషయంలో ‘బిగ్ బాస్’ నిర్వాహకులకు అర్థం కాకపోవడం ఆశ్చర్యకరం.
గత సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ తెలుగు కొత్త సీజన్‌కు ఆదరణ పెరిగిన మాట వాస్తవం. సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ఐతే ఈ సీజన్ అమితాదరణ దక్కించుకునేసరికి కొత్త సీజన్‌ను ఇంకో రెండు నెలల్లోనే మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు నిర్వాహకులు. ఇది జనాలకు పెద్ద షాకే. గత ఏడాది, ఈసారి కరోనా కారణంగా ‘బిగ్ బాస్’ షెడ్యూల్ కంటే ఆలస్యమైన మాట వాస్తవం. వచ్చే ఏడాది సీజన్‌ను వీలును బట్టి కొంచెం ముందుకు జరుపుకోవాల్సింది. ఏడాది మధ్యలోనే సీజన్ మొదలయ్యేలా చూసుకోవాల్సింది.
కానీ అలా కాకుండా ఇంకో రెండు నెలల్లోనే బిగ్ బాస్ కొత్త సీజన్‌ను మొదలుపెట్టాలనుకోవడం సరైన వ్యూహం కాదు. దీని వల్ల జనాలకు కొత్త సీజన్ విషయంలో క్యూరియాసిటీ ఉండదు. అప్పుడే బిగ్ బాస్ అయిపోయిందా అని ఫీలయ్యే వాళ్లు.. ఇంకో రెండు నెలల్లోనే కొత్త సీజన్ అని ఇప్పుడు ఎగ్జైట్ అయినా షో మొదలయ్యాక వాళ్లకే మొహం మొత్తేయొచ్చు. అవసరమైన మేర విరామం లేకుండా షోకు అది మంచిది కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త సీజన్‌కు కొన్ని నెలలు వెనక్కి జరిపితే మంచిదేమో.
This post was last modified on December 20, 2021 1:24 pm
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…