ఒక ఐదారేళ్ల ముందు వరకు లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఎంత బిజీగా ఉండేవారో తెలిసిందే. ప్రతి పెద్ద సినిమాలోనూ దాదాపుగా ఆయన కనిపించేవారు. హీరో తర్వాత అంత హైలైట్ అయ్యే పాత్రల్లో కనిపించేవాడు బ్రహ్మి. ఏటా పదుల సంఖ్యలో సినిమాలు చేస్తూ క్రేజీ కామెడీ రోల్స్‌తో అదరగొడుతూ వచ్చిన ఈ లెజెండ్.. కొన్నేళ్లుగా సినిమాల్లో కనిపించడమే గగనం అయిపోయింది.
వరుసగా ఆయన క్యారెక్టర్లు కొన్ని ఫెయిలవడంతో నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో దాదాపు తెరమరుగైపోయే పరిస్థితి వచ్చింది. ఈ మధ్య బ్రహ్మి చేసిన కాస్త చెప్పుకోదగ్గ పాత్ర అంటే.. జాతిరత్నాలులో జడ్జి క్యారెక్టరే. తర్వాత మళ్లీ గ్యాప్ వచ్చింది. ఐతే ఈ మధ్య బ్రహ్మి బుల్లితెరపై సందడి చేస్తూ యాక్టివ్‌గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆలీతో చేసిన ఓ కార్యక్రమం.. అలాగే బాలయ్యతో కలిసి సందడి చేసిన అన్‌స్టాపబుల్ షో హాట్ టాపిక్స్ అయ్యాయి.
ఇదే టైంలో బ్రహ్మి సినిమాల్లోనూ జోరు పెంచుతున్నాడు. సంక్రాంతికి రానున్న భారీ చిత్రం భీమ్లానాయక్‌లో బ్రహ్మి ఓ క్యారెక్టర్ చేస్తున్న సంగతి తాజాగా వెల్లడైంది. అది కామెడీ రోలేనట. అలాగే కృష్ణవంశీ మూవీ రంగమార్తాండలోనూ బ్రహ్మి ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అది సీరియస్ క్యారెక్టర్ అని సమాచారం. ఇక ఆలీతో షోలో బ్రహ్మానందం మాట్లాడుతూ.. తాను శర్వానంద్, నితిన్ హీరోలుగా తెరకెక్కుతున్న కొత్త చిత్రాల్లోనూ నటిస్తున్నట్లు వెల్లడించారు.
నితిన్ సినిమాకు సంబంధించి బ్రహ్మానందం పాత్ర విషయంలో ఈ మధ్య ఒక రూమర్ నడిచింది. ఆయన షూటింగ్‌కి టైంకి రాకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పించారని గుసగుసలు వినిపించాయి. కానీ ఆ సినిమాలో తాను నటిస్తున్నట్లు బ్రహ్మి చెప్పడంతో ఆ రూమర్లకు చెక్ పడింది. మొత్తానికి ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తున్నారంటే బ్రహ్మి మళ్లీ బిజీ అయినట్లే
This post was last modified on December 8, 2021 12:50 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…