దర్శకధీరుడు రాజమౌళి, పవన్ కళ్యాణ్ ల మధ్య త్వరలోనే మీటింగ్ జరగనుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ని రాజమౌళి కలవలేదు. ఇప్పుడు కలిసి అవకాశం కూడా లేదనిపిస్తుంది. రాజమౌళి డైరెక్ట్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జనవరి 7న విడుదల చేయడానికి ఫిక్స్ చేసుకున్నారు. దీంతో సంక్రాంతి రావాలనుకున్న ఒకట్రెండు సినిమాలు వెనక్కి వెళ్లాయి.
కానీ పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ మాత్రం వెనక్కి తగ్గలేదు.
చెప్పినట్లుగానే జనవరి 12న పవన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘భీమ్లానాయక్’ సినిమా వాయిదా పడితే ‘ఆర్ఆర్ఆర్’కి లాభం ఉంటుంది. లేదంటే మళ్లీ థియేటర్లు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. దీంతో ఈ పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకురావడానికి రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నారు.
పవన్ కళ్యాణ్ ని కలిసి కన్విన్స్ చేస్తే.. ‘భీమ్లానాయక్’ను వాయిదా వేసుకుంటారేమోనని ఆశ పడ్డారు రాజమౌళి. కానీ ఇప్పటివరకు వీరి మధ్య మీటింగ్ జరగలేదు. ప్రస్తుతానికి ‘భీమ్లానాయక్’ రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు లేదు. పవన్ కళ్యాణ్ అదే డేట్ కి రావాలని ఫిక్స్ అయితే మాత్రం రాజమౌళి ఇక ఆయన్ని కలిసి రిక్వెస్ట్ చేయకపోవచ్చు.
నిజానికి ఇప్పటివరకు ‘భీమ్లానాయక్’ షూటింగ్ పూర్తి కాలేదు. కానీ ఇప్పటికే సినిమా నుంచి నాలుగు పాటలను రిలీజ్ చేశారు. మరొక్క పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ డిసెంబర్ 14న రానా పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లానాయక్’ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారంటే.. పవన్ సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేనట్లే!
Gulte Telugu Telugu Political and Movie News Updates