‘అఖండ’లో ఆ నటన చూసి షాక్ అయ్యానంటోన్న బాలయ్య

నందమూరి నటసింహం, మాస్ కా బాప్ బాలకృష్ణ, టాలీవుడ్ మాస్ ఏస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్లా ఈ చిత్రం  ‘అఖండ’ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే ఈ ‘అఖండ’ విజయంపై నందమూరి బాలకృష్ణ స్పందించారు.

‘అఖండ’ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు. కొత్తదనాన్ని ఆదరించే మంచి గుణం మన తెలుగువాళ్లకు ఎప్పుడూ ఉంటుందని కొనియాడారు. ఈ ‘అఖండ’ విజయం మొత్తం సినీ పరిశ్రమ విజయమని చెప్పారు.ఒకప్పుడు భక్తిని రామారావు బ్రతికించారని, ఇప్పుడు భక్తిని ‘అఖండ’ బ్రతికించిందని బాలయ్య ఎమోషన్ అయ్యారు. ఈ చిత్రంలో తెరపై తన నటనను చూసి తానే కాస్త ఆశ్చర్యపోయానని వ్యాఖ్యానించారు.

తాను కేవలం తన దర్శకుడి సూచనలను పాటిస్తానని… తనకు అన్ని సినిమాలు సమానమేనని చెప్పారు. ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం అద్భుతంగా ఉందని బాలకృష్ణ కితాబిచ్చారు. ఇక, థియేటర్లలో అయితే బాలయ్య మాస్ పర్ఫార్మెన్స్ కు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించే దిశగా కలెక్షన్లు వస్తుండడంతో చాలాకాలంగా చప్పగా ఉన్న బాక్సాఫీస్ దగ్గర సందడి మొదలైంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ రేంజ్ హిట్ టాక్ వచ్చిన సినిమా ఇదే కావడంతో నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు.