పవన్ కళ్యాణ్ ని మళ్ళీ వెండితెరపై చూడాలనే అభిమానుల ఆశలు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి కావడానికి మరికాస్త సమయం పడుతుంది. బహుశా దసరాకి లేదంటే సంక్రాంతికి వకీల్ సాబ్ రావచ్చు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో భారీ క్రూ అవసరమయ్యే సినిమాల షూటింగ్ వాయిదా వేస్తే మంచిదని భావిస్తున్నారు. అలా పవన్ తో క్రిష్ తీస్తున్న జానపద చిత్రం వాయిదా పడవచ్చునని అంటున్నారు. ఆ సినిమా షూటింగ్ కి అనువైన వాతావరణం కుదరడానికి కనీసం ఏడాది పడుతుంది కనుక ఈలోగా హరీష్ శంకర్ సినిమా మొదలు పెట్టేస్తారేమో అని అంటున్నారు.
అదే జరిగితే పవన్ ఫాన్స్ కి ఇది పెద్ద శుభవార్తే. గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అయితే చూడాలని అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates