అభిమానులందు నా అభిమానులు వేరు అంటున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. వేరే హీరోల అభిమానుల మాదిరి తన ఫ్యాన్స్ తనపై మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోరని వెంకీ వ్యాఖ్యానించడం విశేషం.
వెంకీ గత సినిమా ‘నారప్ప’ థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీ బాట పట్టగా.. ఇప్పుడు ఆయన మరో చిత్రం ‘దృశ్యం-2’ కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ‘నారప్ప’ టైంలోనే చాలా అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఇప్పుడు వరుసగా రెండో సినిమా కూడా ఓటీటీలో వస్తుండటంతో ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
మరి ఇదే విషయం వెంకీ దగ్గర ప్రస్తావిస్తే.. “ఏం చేస్తాం. ఈ ఏడాదికి అలా అయిపోయింది. నా అభిమానులు చాలా ఓపికతో ఉంటారు. నాపై ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా నన్ను ప్రోత్సహిస్తారు. అన్నింటికీ టైం వస్తుంది. కచ్చితంగా వాళ్లు థియేటర్లలో బాగా ఎంజాయ్ చేసే సినిమాను అందిస్తాను. ‘ఎఫ్-3’తో వాళ్లకు డబుల్ ట్రీట్ ఉంటుంది” అని వెంకీ చెప్పాడు.
‘దృశ్యం-2’ తర్వాత ‘దృశ్యం-3’ కూడా ఉంటుందా అని వెంకీని అడిగితే.. ఉండొచ్చని, అందుకు కొన్నేళ్ల సమయం పట్టొచ్చని, అప్పటికి రాంబాబుకు గడ్డం ఇంకా మెరిసిపోతుందని.. పిల్లలు ఇంకా పెద్ద వాళ్లు అవుతారని చమత్కరించడం విశేషం. దర్శకుడు జీతు జోసెఫ్‌తో మరో సీక్వెల్ గురించి కొంత చర్చ నడిచిందని ఆయనన్నాడు.
ప్రస్తుతం చేస్తున్న ‘ఎఫ్-3’ మినహా ఇంకే కొత్త సినిమా ఒప్పుకోలేదన్న వెంకీ.. ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న తరుణ్ భాస్కర్ సినిమా గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తరుణ్ సహా అందరూ స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నారని.. ఏది బాగుందనిపిస్తే ఆ సినిమా మొదలుపెడతామని వెంకీ అన్నాడు.
This post was last modified on November 18, 2021 11:02 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…