రాజ్​కుంద్రా దంపతులపై చీటింగ్ కేసు!

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్​కుంద్రా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా వారిపై చీటింగ్ కేసు నమోదైంది. ముంబైకి చెందిన నితిన్ బరాయ్ అనే వ్యాపారవేత్త రాజ్​కుంద్రా దంపతులతో పాటు మరికొంతమందిపై ఈ కేసు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. శిల్పాశెట్టి, రాజ్​కుంద్రా మొదలుపెట్టిన ఫిట్నెస్ ఎంటర్ప్రైజెస్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి ఈ జంట డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఇందులో భాగంగా తన దగ్గర నుంచి 1.51 కోట్ల రూపాయలను తీసుకున్నారని.. డబ్బు తిరిగివ్వమని అడిగితే బెదిరిస్తున్నారని ఆ వ్యాపారవేత్త ఫిర్యాదులో పేర్కొన్నారు. నితిన్‌ బరాయి ఫిర్యాదు మేరకు శిల్పాశెట్టి, రాజ్​కుంద్రాలపై ముంబైలోని బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు అధికారులు.

అశ్లీల చిత్రాల కేసులో ముంబై పోలీసులు రాజ్​కుంద్రాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జూలై 19 నుంచి అతడిని కష్టడీలోనే ఉంచారు. పలుమార్లు బెయిల్ కి అప్లై చేసుకున్నా.. రిజెక్ట్ అయింది. ఫైనల్ గా ముంబై కోర్టు రీసెంట్ గా బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చారు. రాజ్​కుంద్రా నేరం చేసినట్లు రుజువైతే గనుక అతడికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది.