డాక్టర్ అని తమిళ సినిమా. కోలీవుడ్లో చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి తర్వాత పెద్ద స్టార్‌గా ఎదిగిన శివ కార్తికేయన్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. కోలమావు కోకిల (తెలుగులో కొకో కోకిల) మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన దిలీప్ నెల్సన్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఫస్ట్ కాపీ కూడా రెడీ చేశారు.
ఇక విడుదలే తరువాయి అనుకుంటుండగా సెకండ్ వేవ్ వచ్చి పడింది. ఈ సినిమా వాయిదా పడింది. సెకండ్ వేవ్ టైంలో ‘డాక్టర్’కు ఓటీటీల నుంచి మంచి ఆఫర్లు వచ్చాయి. దీంతో ఒక దశలో చిత్ర బృందం కూడా టెంప్ట్ అయింది. ఒక డీల్ కూడా ఓకే అయిపోయి.. సోషల్ మీడియాలో ఓటీటీ రిలీజ్ గురించి ప్రకటన కూడా ఇచ్చేశారు. డేట్ ఖరారవ్వడమే మిగిలింది. కానీ ఆ టైంలో ఎందుకో చిత్ర బృందం పునరాలోచనలో పడింది.
ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకుని సెకండ్ వేవ్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని గత నెలలో థియేటర్లలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. దసరా టైంలో తమిళనాట ‘డాక్టర్’ వసూళ్ల వర్షం కురిపించింది. రూ.50 కోట్ల గ్రాస్ మార్కును దాటి కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తెలుగులో శివ కార్తికేయన్‌కు పెద్దగా పేరేమీ లేదు.
అయినా సరే.. ఇక్కడ ‘వరుణ్ డాక్టర్’ పేరుతో విడుదలైన ఈ సినిమా పట్ల నెమ్మదిగా మన ప్రేక్షకులు కూడా బాగానే ఆకర్షితులయ్యారు. తెలుగులో రిలీజ్ చేసిన వాళ్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. గత కొన్నేళ్లలో ఎంత మంచి టాక్ తెచ్చుకున్న సినిమాకైనా ఒకట్రెండు వారాల్లో థియేట్రికల్ రన్ ముగిసిపోతుంటుంది కానీ.. దసరాతో మొదలై దీపావళి వరకు కూడా సినిమా బాగా ఆడుతోంది. ఇప్పుడు కూడా తమిళంలో ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ పడుతున్నాయి.
ఈ మధ్యే మలయాళంలో కూడా ‘డాక్టర్’ను రిలీజ్ చేస్తే అక్కడా వసూళ్లు అదిరిపోతున్నాయి. ఈ క్రమంలో ‘డాక్టర్’ అరుదైన ఘనత సాధించింది. ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును టచ్ చేసింది. సెకండ్ వేవ్ తర్వాత ఇండియాలో 100 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం ఇదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
This post was last modified on November 3, 2021 4:04 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…