ఈ తరంలో స్వశక్తితో పెద్ద స్టార్‌గా ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంత తక్కువ సమయంలో అంత పెద్ద స్టార్ అయిన హీరోలు చాలా అరుదుగా కనిపిస్తారు. తాను ఎన్నో ఏళ్లు కష్టపడ్డాక ఖైదీ సినిమాతో కానీ స్టార్ స్టేటస్ సంపాదించలేదని.. కానీ విజయ్ చాలా తక్కువ టైంలో పెద్ద స్టార్ అయిపోయాడని మెగాస్టార్ చిరంజీవి సైతం అన్నాడంటే విజయ్ ఎదుగుదల ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
విజయ్‌ని చూసి వేరే హీరోలు అసూయ చెంది ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. నిజానికి టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన అల్లు అర్జున్ దగ్గర ఎవరో నేరుగానే ఈ విషయం ప్రస్తావించారట. విజయ్ అలా వేగంగా ఎదిగిపోతుంటే మీకు అసూయగా అనిపించదా అని అడిగారట. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కొత్త చిత్రం పుష్పక విమానం ప్రి రిలీజ్ ఈవెంట్లో బన్నీ ఈ విషయం ప్రస్తావించాడు.
ఐతే ఆ ప్రశ్న అడిగిన వ్యక్తితో.. తానెందుకు విజయ్‌ని అసూయ చెందుతానని ఎదురు ప్రశ్నించినట్లు బన్నీ వెల్లడించాడు. సినిమాలనే కాదు.. ఏ రంగానికైనా వర్తించే విషయం ఒకటుందని.. ఎవరైనా మనల్ని దాటి ముందుకు వెళ్లిపోతున్నారంటే మనం వేగంగా పరుగెత్తడం లేదని అర్థమని.. అప్పుడు తప్పు మనదవుతుంది తప్ప మనల్ని దాటి ముందుకు వెళ్తున్న వ్యక్తిది కాదని.. కాబట్టి విజయ్‌ని చూసి తాను ఎప్పడూ అసూయ చెందలేదని, చెందబోనని బన్నీ స్పష్టం చేశాడు.
విజయ్ స్వశక్తితో ఎదిగిన నటుడని.. అతడంటే మొదట్నుంచి తనకు చాలా చాలా ఇష్టమని బన్నీ చెప్పాడు. విజయ్ చాలా కొత్తగా ఆలోచిస్తాడని.. అదే సమయంలో అతడిలో ఒక స్వీట్‌నెస్ ఉంటుందని.. సినిమాల వరకే కాకుండా బిజినెస్ పరంగా కూడా రౌడీ బ్రాండు తీసుకొచ్చి దాన్ని విజయ్ ప్రమోట్ చేసిన తీరు తననెంతో ఆకట్టుకుందని బన్నీ కొనియాడాడు.
This post was last modified on October 31, 2021 10:59 am
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ…