పెళ్లి సంద‌డి హీరోయిన్ నా కూతురు కాదు


పెళ్ళి సంద‌డి సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది శాండిల్ వుడ్ భామ శ్రీ లీల‌. బెంగ‌ళూరుకు చెందిన ఈ అమ్మాయి క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌థానాయిక‌గా ఇప్ప‌టికే మంచి పేరు సంపాదించింది. భ‌రాట్, కిస్ లాంటి చిత్రాల‌తో ఫేమ్ తెచ్చుకున్న శ్రీలీల‌పై ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు దృష్టి ప‌డింది. దీంతో ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌, నిర్మాణంలో తెర‌కెక్కిన పెళ్ళి సంద‌డిలో శ్రీలీల‌కు అవ‌కాశం ద‌క్కింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా శ్రీ లీల తెలుగ‌మ్మాయే అని రాఘ‌వేంద్ర‌రావు వెల్ల‌డించారు. శ్రీలీల కూడా అదే మాట చెప్పింది. త‌న తండ్రి పేరు.. సూర‌ప‌నేని శుభాక‌ర్ రావు అని వెల్ల‌డించింది.

ఐతే బెంగ‌ళూరులో పెద్ద వ్యాపార‌వేత్త అయిన శుభాక‌ర్ రావు.. శ్రీలీల వ్యాఖ్య‌ల్ని ఖండించారు. ఆమె త‌న కూతురు కాద‌న్నారు. శ్రీ లీల త‌ల్లి త‌న మొద‌టి భార్య అని.. ఐతే ఆమె తాను విడిపోయాకే శ్రీలీల పుట్టింద‌ని.. ఆమెతో త‌న‌కే సంబంధం లేద‌ని శుభాక‌ర్ రావు వివ‌రించారు. ఆస్తుల‌కు సంబంధించి శ్రీలీల త‌ల్లికి, త‌న‌కు మ‌ధ్య కేసులు న‌డుస్తున్నాయ‌ని.. అవి కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయ‌ని.. ఐతే ఆస్తుల కోస‌మే శ్రీ లీల త‌న‌ను తండ్రిగా పేర్కొంటోంద‌ని.. మీడియాకు అలా చెప్పి త‌ప్పుదోవ ప‌ట్టిస్తోంద‌ని.. ఈ విష‌యంలో న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని మీడియాకు శుభాకర్ రావు చెప్ప‌డం గ‌మనార్హం.

మ‌రి ఈ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో శ్రీలీల ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ సంగ‌త‌లా వ‌దిలేస్తే.. పెళ్ళిసంద‌డి చిత్రానికి చాలా పేల‌వ‌మైన టాక్ వ‌చ్చింది. అయినప్ప‌టికీ ద‌స‌రా సెల‌వుల్లో ఈ చిత్రానికి మంచి వ‌సూళ్లే వ‌స్తున్నాయి. శ్రీలీల‌కు సినిమాతో మంచి పేరే వ‌చ్చింది. పాట‌ల్లో ఆమె గ్లామ‌ర్ బాగా హైలైట్ అయింది. త‌న‌కు మరిన్ని అవ‌కాశాలు వ‌చ్చేలా క‌నిపిస్తున్నాయి.