నేచురల్ స్టార్ నానికి ఈ మధ్యకాలంలో సరైన హిట్టు పడలేదు. ఆయన నటించిన ‘వి’, ‘టక్ జగదీష్’ సినిమాలు ఓటీటీలో విడుదల కాగా.. అవి ప్రేక్షకులను నిరాశపరిచాయి. దీంతో తన తదుపరి సినిమాలతో హిట్స్ అందుకోవాలని చూస్తున్నారు నాని. ఇప్పటికే రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను పూర్తి చేశారు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ రూపొందిస్తోన్న ‘అంటే సుందరానికి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే నాని మరో సినిమాను పట్టాలెక్కించబోతున్నారు.
నాని 29వ సినిమాగా తెరకెక్కనున్న దీనికి సంబంధించిన అప్డేట్ ను దసరా కానుకగా అక్టోబర్ 15న అనౌన్స్ చేయనున్నారు. ఈ విషయాన్ని నాని స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అలానే ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాతో శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు. గతంలో సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన శ్రీకాంత్.. సింగరేణి కోల్ మైనింగ్ బ్యాక్ డ్రాప్ లో ఓ కథను రాసుకున్నారు.
అది నానికి వినిపించగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని దసరా రోజు అనౌన్స్ చేయనున్నారు. తెలంగాణలో కొత్తగూడెం ఏరియాలో కథ నడుస్తుందట. ఇందులో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారని తెలుస్తోంది. తొలిసారి నాని ఇలాంటి ప్రయత్నం చేయబోతున్నారు. రవితేజతో ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను నిర్మిస్తోన్న ఎస్వీఎల్ సినిమాస్ సమంత నాని సినిమాను కూడా నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
This post was last modified on October 13, 2021 6:19 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…